పవన్‌కళ్యాణ్‌తో వైవాహిక బంధం తెగిపోయినా కానీ ఇంకా అతడిపై గౌరవం ఏమాత్రం తగ్గలేదని, తనలాంటి వ్యక్తిని తాను ఎక్కడా చూడలేదని, పవన్‌ని వేలెత్తి చూపించడానికి ఎవరూ సరిపోరని రేణు దేశాయ్ అవకాశం ఉన్నప్పుడల్లా తన భర్తపై ప్రశంసలు కురిపిస్తోంది. పవన్‌తో విడిగా ఉంటున్నా కానీ రేణు ఇంకా మాజీ భర్త జపం చేయడం పవన్ అభిమానులకి నచ్చడం లేదు.
మర్చిపోతున్న విషయాన్ని మళ్లీ మళ్లీ రేణు గుర్తు చేస్తోందనేది వారి బాధ. ఇదిలావుంటే మరాఠీ ఫిలిం ఇండస్ట్రీలో రేణు దేశాయ్ ప్రొడ్యూసర్‌గా బిజీ అయింది. పవన్ పిల్లలు అకిరా, ఆద్య పేర్ల మీద రెండు బ్యానర్లు స్థాపించి వాటిపై చిత్ర నిర్మాణం చేపట్టాలని చూస్తోంది. అయితే ఈ బ్యానర్స్‌తో పవన్‌కళ్యాణ్‌కి ఎలాంటి సంబంధం ఉండదు.
పవన్ ఆలోచనలతో స్ఫూర్తి పొందిన తాను తన సినిమాల్లో కూడా అలాంటి ఉన్నత విలువలే పాటిస్తానని రేణు దేశాయ్ చెప్తోంది. పిల్లలకి కూడా సినీ రంగంతో ఇప్పట్నుంచే పరిచయం ఉండేలా, వారు ఇటుగా ఆకర్షితులయ్యేలా రేణు దేశాయ్ వారిని తీర్చిదిద్దుతోంది. పవన్ కూడా తరచుగా తన పిల్లల్ని షూటింగులకి తీసుకొస్తుంటాడు కాబట్టి తనకీ వారు సినిమాపై ఆసక్తి చూపించడం ఇష్టమేనని అనిపిస్తోంది.