పవన్ సినిమా ఖర్చు పెరుగుతోందట

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమాను నిర్మిస్తోంది హారిక హాసిని సంస్థ. ఈ సినిమాను ప్లాన్ చేసినపుడు 95 కోట్ల బడ్జెట్. ఇందులో సింహభాగం డైరక్టర్ త్రివిక్రమ్, హీరో పవన్…

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమాను నిర్మిస్తోంది హారిక హాసిని సంస్థ. ఈ సినిమాను ప్లాన్ చేసినపుడు 95 కోట్ల బడ్జెట్. ఇందులో సింహభాగం డైరక్టర్ త్రివిక్రమ్, హీరో పవన్ ల పారితోషికమే. దీనికి తోడు సినిమాలో బీభత్సంగా విజువల్ ఎఫెక్ట్స్ వాడడం. ఇక సెట్ ల సంగతి చెప్పనక్కరే లేదు. అందువల్ల ప్రారంభంలోనే మరో అయిదుకోట్లు అటే కానీ, ఇటు మాత్రం కాదని అంచనా వేసుకున్నారు. 

అయితే ఇప్పుడు ఆ అంచనాలు సరిపోవడం లేదట. టోటల్ సినిమా పూర్తయ్యే సరికి 120 కోట్ల మేరకు బడ్జెట్ అవుతుందని యూనిట్ వర్గాల బోగట్టా. ఇప్పటి దాకానే చాలా ఖర్చయిందట. ఇంకా చాలా సినిమా వుంది కాబట్టి ఇంకా చాలా ఖర్చవుతుందట. అందువల్ల టోటల్ గా 120 కోట్ల వ్యయం తప్పదని టాక్. 

అయితే లక్ ఏమిటంటే, త్రివిక్రమ్ కు పవన్ కు సోలోగానే భయంకరమైన మార్కెట్ వుంది. మరి ఇద్దరు కలిస్తే అది మరికాస్త పెరుగుతుంది. అందువల్ల అన్నీ కలిపి 150 నుంచి 160 కోట్ల మేరకు బిజినెస్ జరుగుతుందని యూనిట్ ధీమాగా వున్నట్లు కనిపిస్తోంది. ఆ ధీమా లేకపోతే, ఇంత ఖర్చు పెట్టడం సాధ్యం కాదు కదా?