పవన్ కోసం కొత్త కథలు

పవన్ సినిమాలు మానేస్తానని చెప్పలేదు. కానీ చేసే ఆలోచన అయితే వున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో పవన్ హీరోగా కాకుండా, సూపర్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో పెట్టి, యంగ్ పెయిర్ తో…

పవన్ సినిమాలు మానేస్తానని చెప్పలేదు. కానీ చేసే ఆలోచన అయితే వున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో పవన్ హీరోగా కాకుండా, సూపర్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో పెట్టి, యంగ్ పెయిర్ తో సినిమా కథ తయారుచేస్తే, ఓకె అంటారేమో అన్న ఆలోచనలు బయల్దేరాయి ఇండస్ట్రీలో. పైగా ఎప్పటి నుంచో మెగా హీరోల మల్టీ స్టారర్ అనేది తెరమీదకు రావాలనే కోరిక అభిమానుల్లో వుంది.

అందుకే ఇప్పుడు సూపర్ పవర్ ఫుల్ క్యారెక్టర్ పవన్ కు తయారుచేస్తూ, సాయిధరమ్ తేజ హీరోగా కథ తయారుచేసే ఆలోచనలు చేస్తున్నారట ఒకరిద్దరు దర్శకులు. అలా అయితే పవన్ ఎక్కువ టైమ్ కేటాయించనక్కరలేదు సినిమాకు. పైగా పవన్ సినిమాలకు దూరమయ్యారన్న ఆలోచన, ఆవేదన అభిమానులకు వుండదు. 

పైగా పవన్ పవర్ ఫుల్ రోల్ లో వున్నారంటే చాలు సినిమా బిజినెస్ కు లోటు వుండదు. అలాగే క్యారెక్టర్ పాత్ర అయినా కూడా పవన్ కు కనీసం పదిహేను కోట్లయినా రెమ్యూనిరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా వుంటారు. అందువల్ల ఈ యాంగిల్ లో ట్రయ్ చేస్తే ఏలా వుంటుంది అన్న ఆలోచనలను ఒకరిద్దరు దర్శకులు చేస్తున్నట్లు బోగట్టా.

ఇదేదో బాగానే వుంది. పవన్ కూడా పెద్దగా ఎక్కువ కష్టపడకుండా, సినిమాలు చేసి, ఆదాయం పొందినట్లు వుంటుంది. కానీ ఆ రేంజ్ పాత్రలు, ఆ రేంజ్ కథలు దర్శకులు వండగలగాలి కదా?