పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ పక్కా అయిపోతుంది. పింక్ రీ మేక్ కు సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. థమన్ అప్పుడే రెండు ట్యూన్ లు కూడా ఇచ్చేసాడు. మరో ట్యూన్ ఇవ్వాలి. నివేదా థామస్, అంజలి, అనన్య (మల్లేశం హీరోయిన్) ఇప్పటికి ఎంపికైన ముగ్గురు హీరోయిన్లు. అయితే వీరు హీరోయిన్లు కారు. సినిమాలో ముగ్గురు అమ్మాయిల కీలక పాత్రలు వున్నాయి. వాటి కోసం వీరిని తీసుకుంటున్నారు.
ఆ సంగతి అలా వుంచితే ఈ సినిమా కోసం పవన్ కు 50 కోట్ల రెమ్యూనిరేషన్ ఇస్తున్నట్లు బోగట్టా. అయితే ఇంకా పవన్ కు ఏమీ ఇవ్వలేదు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోగా సింగిల్ ఫేమెంట్ ఇవ్వాల్సి వుంది. అప్పుడే ఆయన షూటింగ్ కు వస్తారని బోగట్టా. పవన్ తో ఓ నాన్ కమర్షియల్ రీమేక్ చేస్తూ, యాభై కోట్లు ఇవ్వడం అంటే నిర్మాత దిల్ రాజు స్ట్రాటజీ ఏమిటి అన్నది టాలీవుడ్ లో వినిపిస్తున్న ప్రశ్న.
పవన్ రీ ఎంట్రీ తొలిసినిమా అన్నది ఒక్కటే దిల్ రాజు ధీమా. కానీ పవన్ సినిమా బాగా లేకుంటే అజ్ఞాతవాసిని తీసి పక్కన పెట్టారు. గట్టిగా యాభై కోట్లు చేయలేకపోయింది. పవన్ కు యాభై ఇచ్చి, ఇరవై కోట్లతో సినిమా తీసేయాలన్నది దిల్ రాజు ప్లాన్ అని తెలుస్తోంది.
అందుకే అంజలి, అనన్య లాంటి వారిని సినిమాలోకి తీసుకుంటున్నారు. సింగిల్ సెట్ లో, గట్టిగా రెండు నెలలు కాకుండానే సినిమా తీయాలన్నది ప్లాన్. అలా అయితే మంచి లాభాలు వస్తాయని లెక్క వుందని టాక్. కానీ సమస్య ఏమిటంటే, ముందుగా లాభాలు రావొచ్చు. కానీ పింక్ సినిమాకు తెలుగునాట 70 కోట్ల మేరకు కలెక్షన్లు వస్తాయా? అన్నది అనుమానం.
త్రివిక్రమ్ కాంబినేషన్, కమర్షియల్ సినిమా గానే ఏమీ లాభం లేకపోయింది. ఇక పింక్ లాంటి డ్రై సబ్జెక్ట్ పవన్ ఫ్యాన్స్ కు ఎక్కుతుందా?అయితే తన రెగ్యులర్ బయ్యర్ల ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయించుకుని, లాభం అయినా నష్టం అయినా తనే భరించాలన్నది దిల్ రాజు ఆలోచనగా తెలుస్తోంది. బాలయ్య-చిరంజీవి-పవన్ లతో సినిమాలు చేయాలన్నది దిల్ రాజు కోరిక. వీటిలో ఒక కోరిక తీరిపోతుంది. అందువల్ల నష్టం రాకుండా వుంటే చాలు అని ఆలోచిస్తూ, ఈ ప్రాజెక్టు టేకప్ చేస్తున్నట్లు బోగట్టా.