Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ పై విమర్శలు తిప్పికొట్టండి ప్లీజ్!

పవన్ పై విమర్శలు తిప్పికొట్టండి ప్లీజ్!

‘’బాబా ఓ మాట చెప్ప మన్నారు… పోతిన మహేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. మన లాంటి వాళ్లు వాటిని ఖండిస్తే బాగుంటుంది…’’

ఇదీ పవన్ తో సాన్నిహిత్యం వున్న ఓ చిన్న నటుడు టాలీవుడ్ లో తనకు పరిచయం వన్న, పవన్ తో సాన్నిహిత్యం వున్న కొందరికి ఫోన్ చేసి చెప్పిన మాటలు. ఇక్కడ బాబా అంటే పవన్. ఆయనకు సన్నిహితంగా వుండే కొందరు, తమలో తాము పవన్ ను బాబా అనే ముద్దు పేరుతో పిలుచుకుంటారు.

నిన్నటికి నిన్న విజయవాడలో పోతిన మహేష్ మీడియా ముందు చెలరేగిపోయారు. పవన్ విషయాల గుట్టు మట్లు అన్నీ మీడియా ముందు కుప్పగా పోసారు. వీటిలో ఎన్ని వాస్తవాలు, ఎన్ని అవాస్తవాలు అన్న సంగతి అలా వుంచితే, పవన్ వల్ల టాలీవుడ్ లో బాగుపడిన వారు ఒక్కరంటే ఒక్కరు లేరు అన్నది గట్టిగా తగిలింది, నిజానికి అది నిజం కూడా. పవన్ దగ్గర వుండి ఎవ్వరూ బాగుపడిన వారు లేనట్లే. నిర్మాతలు కూడా చాలా అంటే చాలా మంది నష్టాలే చవిచూసారు.

పంజా సినిమా తీసిన నిర్మాత మళ్లీ కోలుకుని పెద్ద సినిమా తీయలేకపోయారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు పెద్దగా సంపాదించి పెట్టింది లేదు. అక్కడక్కడ సరిపోవడమో, చేతికి కాస్త తగలడమో జరిగింది తప్ప. హరి హర వీరమల్లు సినిమాను అలా పక్కన పడేస్తే, పాపం ఆ నిర్మాత రత్నం కక్కలేక మింగలేక అలా వున్నారు. ఒక నిర్మాత జనసేన సోషల్ మీడియా వింగ్ ను తన స్వంత ఖర్చులతో నిర్వహించడం వల్ల అప్పట్లో తొమ్మిది కోట్లు బిల్ అయింది. ఇప్పటికీ అది పెండింగ్ లోనే వుంది. శరత్ మరార్ సంగతి తెలిసిందే.

పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిచాలని పవన్ కు సన్నిహితుడైన ఆ చిన్న నటుడు చేసిన సూచనను కొందరు టాలీవుడ్ జనాలు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

నిజానికి పోతిన మహేష్ కు దీటుగా, పవన్ కు మద్దతుగా వాయిస్ ను గట్టిగా వినిపించాలి అంటే ఇండస్ట్రీలో వున్నది బండ్ల గణేష్ మాత్రమే. కానీ గణేష్ హార్డ్ కోర్ కాంగ్రెస్ వాదిగా ఉన్నారు. అలాగే కాంట్రావర్సీలకు దూరంగా వుంటున్నారు. ఇక పవర్ స్టార్ అభిమానులు ఎవరూ ఎందుకు గొంతు విప్పడం లేదో, వారికే తెలియాలి.

మొత్తం మీద పవన్ కు ఇండస్ట్రీ నుంచి మద్దతు వస్తున్నట్లు కనిపించడం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?