Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఇంకా పదిరోజులు - ఇప్పుడేంటీ?

ఇంకా పదిరోజులు - ఇప్పుడేంటీ?

ఇరు వైపుల మేనిఫెస్టోలు అయిపోయాయి. రాసిందే రాసి రాసి ఎల్లో పత్రికలు అలసిపోతున్నాయి. జనం ఆ పత్రికల మొదటి పేజీ చూస్తేనే మొహం మొత్తుతోంది. సోషల్ మీడియాలో ఎల్లో హ్యాండిల్స్ ఇవీ అని క్లారిటీ వచ్చేసింది. అందువల్ల ఎంత మెటీరియల్ డంప్ చేసినా పట్టించుకునేవారు లేరు. ఇక ఏ ప్రచారం వున్నా గ్రౌండ్ లెవెల్ లోనే. తెలుగుదేశం- జనసేన కూటమి తమ అస్త్రాలు అన్నీ వాడేసినట్లే. పవన్- బాబు ప్రచారం కానీ, లాండ్ చట్టం కానీ, ఇంకేమైనా కానీ. షర్మిల సింగిల్ పాయింట్ ప్రచారం. వివేక్ హత్య‌. ఇక ఈ పది రోజులు కూడా అందరూ వీటినే అరగదీయాల్సి వుంటుంది.

ఈ లోగా జగన్ జల్లాకు రెండు వంతున సభలు ప్లాన్ చేసారు.. వాటిని పెంచుకుంటున్నారు. ఆయనదీ సింగిల్ పాయింట్ నే. నన్ను నమ్ముతారా? బాబును నమ్ముతారా? నేను మీకైనా ఇచ్చానా లేదా చూడండి. నా వల్ల ఓ రూపాయి మీకు వస్తేనే ఓటేయండి అంటున్నారు. ఇదే ఈ పది రోజులు కూడా చెబుతారు.  

ఇవన్నీ కాదు. అసలు సంగతి ఇప్పుడే వుంది. ఇప్పటి వరకు ప్రచారానికి తీయాల్సినంత డబ్బు ఎవరి స్థాయిలో వాళ్లు తీసారు. చాలా మందికి ఇప్పటికే కాళ్లు పీకుతున్నాయి. వైకాపా అభ్యర్ధులకు అందరికీ కాకున్నా, కొందరికి కూడా ఈ సమస్య వుంది. జనసేన, తేదేపా అభ్యర్ధులు కొందరు బలమైన వారు, కాళ్లకి ఆర్ధిక సమస్యలు లేవు. కానీ ఎక్కువ మందికి ఇబ్బందిగానే వుంది. వైకాపా ఖర్చు జోరును తట్టుకోలేకపోతున్నారు.

చివరి ఘట్టంలో డబ్బుల మూటలు విప్పి, పంచకుండా ఏ ఎన్నిక పూర్తి కాదన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికకు, ఇప్పుడు జరుగుతున్న ఆంధ్ర ఎన్నికకు తేడా వుంది. పోలిక వుంది. తెలంగాణ ఎన్నికల్లో జనాలు ఎక్కువ మార్పు కోరుకున్నారు. ఆంధ్రలో కూడా కొంతయినా కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. కానీ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు కూడా బలంగా ఖర్చు చేసారు. తెరాస అభ్యర్ధులకు దీటుగా ఖర్చు చేసారు కాంగ్రెస్ అభ్యర్ధులు. అందువల్ల అక్కడ వర్కవుట్ అయింది. కానీ ఆంధ్రలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. అందువల్ల జనాల రియాక్షన్ ఎలా వుంటుందన్నది చూడాలి.

పల్లెల్లో ఇంకా డబ్బు తీసుకుంటే కాస్తయినా మాట మీద వుండి ఓటు వేయాలి అనే పద్దతి వుంది. ఒక ఇంట్లో రెండు ఓట్లు వుంటే, రెండు పార్టీలు డబ్బులు ఇస్తే, చెరో వైపు ఓటు అనే పద్దతి పాటిస్తారు. ఇద్దరూ ఇవ్వకుండా ఒక్కరే ఇస్తే అది వేరుగా వుంటుంది. అలాగే ఎక్కువ తక్కువ లెక్కలు వుంటాయి. డబ్బులు తీసుకోండి.. అయినా మాకే ఓటు వేయండి అని చెప్పే సుద్దులు జనాలకు అంత సులువుగా ఎక్కవు. హార్డ్ కోర్ జనాలు ఎటు వాళ్లు అటే వుంటారు. కానీ న్యూట్రల్ జనాలు ఈ డబ్బులకు చాలా వరకు ప్రభావితం అవుతారు.

మిగిలిన పది రోజుల్లో అయిదు రోజులు ప్రచారం కీలకం

అయిదు రోజుల ఖర్చు కీలకం

చివరి రోజు పోల్ మేనేజ్ మెంట్ అంతకన్నా కీలకం

ఈ మూడింటి మీదే ఫలితం ఎక్కువ ఆధారపడి వుంటుంది. అసలు ఎన్నికల మజా అంతా ఇప్పుడే వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?