పవన్ చేయాల్సిన సినిమా తేజ్ కి?

సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభమైంది. ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో పవర్ స్టార్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. నిర్మాతలు భగవాన్ పుల్లారావు. చాలా కాలంగా లైమ్ లైట్ లో లేని ప్రొడ్యూసర్లు.…

సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభమైంది. ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో పవర్ స్టార్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. నిర్మాతలు భగవాన్ పుల్లారావు. చాలా కాలంగా లైమ్ లైట్ లో లేని ప్రొడ్యూసర్లు. గౌతమ్ నందా సినిమా ఇచ్చిన షాక్ తరువాత నిర్మాణానికి కాస్త దూరంగా వున్నారు. రెండు సినిమాల సక్సెస్ తరువాత మూడో ప్రామిసింగ్ సినిమా చేస్తున్న సాయి ధరమ్ తేజ్ ఈ నిర్మాతలకు డేట్ లు ఇవ్వడం కాస్త ఆశ్చర్యం కలిగించింది ఇండస్ట్రీలో.

అయితే తేజ్ ఎప్పడో చాలా కాలం ఇచ్చిన కమిట్ మెంట్ మేరకు ఈ సినిమా చేస్తున్నాడని చెబుతున్నారు. కానీ అది ఒక్కటే కారణం కాదని, ఇంకో కారణం కూడా వుందని తెలుస్తోంది. అదేమిటంటే, భగవాన్ పుల్లారావులకు పవన్ కళ్యాణ్ కూడా ఓ సినిమా చేయాల్సి వుందట. గతంలో ఎప్పుడో ఆ మేరకు మాట ఇచ్చారు కానీ జరగలేదు.

అందుకే ఆ మేరకు మేనల్లుడు తేజ్ కు ఓ సినిమా చేయాల్సిన బాధ్యత అప్పగించారు మామ పవన్ కళ్యాణ్ అని టాక్ వినిపిస్తోంది. పైగా అందుకే ప్రత్యేకంగా ఆయనే క్లాప్ కొట్టడానికి వచ్చారని తెలుస్తోంది. మెగా బ్రదర్స్ లోమొదటి నుంచీ తేజ్ ను ఎంకరేజ్ చేస్తున్నది పవన్ కళ్యాణ్ నే. అందుకే ఆయన మాట మేరకు సాయి ధరమ్ తేజ్ ఈ ప్రాజెక్టు టేకప్ చేసారని తెలుస్తోంది.
 
అంతవరకు బాగానే వుంది. కానీ అస్సలు లైమ్ లైట్ లో లేని దేవా కట్టాతో సినిమా ఏమిటో? అందులోనూ కమర్షియల్ సంగతి పక్కన పెట్టి ఎమోషనల్ పొలిటికల్ డ్రామాను తలకు ఎత్తుకోవడం ఏమిటో?

నువ్వొస్తావా? నన్ను రమ్మంటావా?

మేన‌ల్లుడి చిత్ర ప్రారంభోత్స‌వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్