పవన్ సరసన శృతిహాసన్ !

పవర్ స్టార్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ హడావుడి ప్రారంభమైంది. ఫస్ట్ లుక్ వచ్చింది. ఫస్ట్ సాంగ్ వచ్చింది. షూటింగ్ వెల్ ప్లాన్డ్ గా సాగుతోంది. కానీ పవన్ సరసన హీరోయిన్ ఎవరు? ఈ…

పవర్ స్టార్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ హడావుడి ప్రారంభమైంది. ఫస్ట్ లుక్ వచ్చింది. ఫస్ట్ సాంగ్ వచ్చింది. షూటింగ్ వెల్ ప్లాన్డ్ గా సాగుతోంది. కానీ పవన్ సరసన హీరోయిన్ ఎవరు? ఈ క్వశ్చనుకు ఇంకా అధికారికంగా ఆన్సరు రాలేదు. కానీ నిర్మాత దిల్ రాజు, డైరక్టర్ శ్రీరామ్ వేణు రకరకాల ఆప్షన్ పరిశీలిస్తూనే వున్నారు. ఇప్పటికే అనేక ఆప్షన్లు గ్యాసిప్ లుగా బయటకు వచ్చాయి. కానీ ఏదీ సెట్ కాలేదు. 

ఇప్పుడు లేటెస్ట్ గా మరో పేరు బయటకు వచ్చింది. పవన్ తో గతంలో రెండు సినిమాలు చేసిన శృతి హాసన్ పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పవన్-దిల్ రాజు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇక శృతి డేట్ లు, రెమ్యూనిరేషన్ వంటివి ఫైనల్ కావాల్సి వుంది.

గబ్బర్ సింగ్ లో పవన్-శృతి హిట్ మంచి పెయిర్ గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత కాటమరాయుడులో అదే పెయిర్ రిపీట్ చేసారు. ఇప్పుడు పింక్ రీమేక్ కు శృతి ఫిక్స్ అయితే ముచ్చటగా మూడో సినిమా అవుతుంది. వకీల్ సాబ్ లో వాస్తవానికి హీరోయిన్ కు అంత నిడివి వుండదు. కానీ తెలుగు వెర్షన్ లో వీలయినంత పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

పరిశ్రమ పరువు తీసేది కాదు, పరువు పెంచేది ఈ సినిమా