పవన్-త్రివిక్రమ్ సినిమా.. ఇది ఏ నవల?

మరోసారి కుటుంబ బంధాలు, బాంధవ్యాలు నేపథ్యంలో సినిమా తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ తరహాలోనే ఇది కూడా కంప్లీట్ కుటుంబ కథా చిత్రం. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ…

మరోసారి కుటుంబ బంధాలు, బాంధవ్యాలు నేపథ్యంలో సినిమా తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ తరహాలోనే ఇది కూడా కంప్లీట్ కుటుంబ కథా చిత్రం. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. మూవీలో రెండో తల్లికి కొడుకుగా పవన్ కల్యాణ్ కనిపించబోతున్నాడనే రూమర్ చాన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. దీనికి తోడు కొత్తగా ఇప్పుడు మరో రూమర్ మొదలైంది. పవన్-త్రివిక్రమ్ సినిమా ఓ పాత హిట్ నవల ఆధారంగా రాబోతోందట.

ఈ పుకారు రావడానికి ఓ కారణం కూడా ఉంది. ఇంతకుముందు త్రివిక్రమ్ తెరకెక్కించిన అ..ఆ సినిమా ఓ హిట్ నవల ఆధారంగానే వచ్చింది. ఈ విషయాన్ని మేకర్స్ ఎక్కడా అధికారికంగా చెప్పలేదు కానీ యద్దనపూడి సులోచనరాణి రాసిన మీన అనే నవలలోని సన్నివేశాలు, పాత్రల ఛాయలు చాలానే కనిపిస్తాయి అ..ఆ సినిమాలో. రిలీజైన తర్వాత ఆ విషయాన్ని త్రివిక్రమ్ కూడా అంగీకరించాడు.

సో.. ఇప్పుడు పవన్ సినిమాకు కూడా ఓ పాత నవల నుంచి స్ఫూర్తి పొంది కథ రాసుకున్నాడని టాక్. మరోవైపు పవన్ క్యారెక్టర్  ఏంటనే విషయంపై కూడా లీకులు రావడంతో చాలామంది అది ఏ నవల అయి ఉంటుందా అని ఆరాలు తీస్తున్నారు.