Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ వదిలేయడం మంచిదయింది

పవన్ వదిలేయడం మంచిదయింది

24...విక్రమ్ కుమార్-సూర్య కాంబినేషన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ. ఈ కథను ముందు తెలుగు హీరోలే విన్నారు. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ లేకుండా విక్రమ్ కుమార్ రంగంలోకి దిగడు. అలాంటి స్క్రిప్ట్ ను ముందుగా మహేష్...పవన్ కళ్యాణ్ కే చెప్పాడు విక్రమ్ కుమార్. కానీ మన టాప్ హీరో లిద్దరూ చేయడానికి నో చెప్పారు. మహేష్ బాబు చెప్పిన రీజన్ సబబుగా వుంది. తన ఫేస్ ఓల్డ్ గెటప్ కు అంతగా సూట్ కాదని, పైగా విలనిజం తన ఫేస్ లో పండదేమో అని చెప్పేసాడు. 

అది చాలా వరకు కరెక్టే కూడా. కానీ మహేష్ చేసి వుంటే వాచ్ మేకర్ పాత్రకు భలే జోష్ వచ్చి వుండేది. కానీ ఆత్రేయ క్యారెక్టర్ డౌన్ అయిపోయేది. ఇక పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లింది స్క్రిప్ట్..ఆయన కూడా నో చెప్పారు..రీజన్ ఏం చెప్పారు అన్నది తెలియదు కానీ, టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాలు మాత్రం ఓ చిత్రమైన సంగతి చెబుతున్నాయి. విక్రమ్ కుమార్ ఈ స్క్రిప్ట్ నెరేట్ చేస్తుంటే, తనకు నిద్ర వచ్చిందని సన్నిహితుల దగ్గర పవన్ కామెంట్ చేసాడని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. 

మరి ఇంత వైవిధ్యమైన సబ్జెక్ట్ ఎందుకు నిద్రవచ్చేలా చేసిందో పవన్ కే తెలియాలి. ఏమైతేనేం ఈ సబ్జెక్ట్ అలా సూర్య దగ్గరకు వెళ్లిపోయింది. అది ఒకందుకు మంచిదే అయింది.. తమిళ సూపర్ స్టార్ కావడం వల్ల, తెలుగులో పరిచయం బాగా వుండడం వల్ల సౌత్ ఇండియన్ ఫిల్మ్ అయిపోయింది. అదే పవన్ లేదా మహేష్ చేసి వుంటే కేవలం తెలుగు సినిమాగా మిగిలిపోయి వుండేది. ఆత్రేయగా సూర్య అద్భుతమైన ఫెర్ ఫార్మెన్స్ చూసే అవకాశం వుండేది కాదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?