పవన్‌ సినిమాలు చేస్తాడు… కానీ

పవన్‌కళ్యాణ్‌ రాజకీయ పరంగా బిజీ అయిన విషయం కనిపిస్తూనే వుంది. ఇకపై నటిస్తాడా అనే దానిపై 'రిటైర్‌ అయిపోయా' లాంటి స్టేట్‌మెంట్స్‌ ఇవ్వకపోయినా నటనపై అంత ఆసక్తి లేదని అయితే చెబుతూనే వున్నాడు. పవన్‌…

పవన్‌కళ్యాణ్‌ రాజకీయ పరంగా బిజీ అయిన విషయం కనిపిస్తూనే వుంది. ఇకపై నటిస్తాడా అనే దానిపై 'రిటైర్‌ అయిపోయా' లాంటి స్టేట్‌మెంట్స్‌ ఇవ్వకపోయినా నటనపై అంత ఆసక్తి లేదని అయితే చెబుతూనే వున్నాడు. పవన్‌ ఇన్‌కమ్‌ సోర్స్‌ సినిమాలు మాత్రమే కావడంతో అవి మానేసి ఎలా నెట్టుకొస్తాడనేది టాపిక్‌గా మారింది.

సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యే ఆలోచనలో అయితే పవన్‌కళ్యాణ్‌ లేడట. నిర్మాతగా పవన్‌ వచ్చే ఏడాది నుంచి బిజీ అవుతాడని సమాచారం. పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టడానికి తనకి సమయం కుదరదు కనుక లైక్‌ మైండెడ్‌ పీపుల్‌లో టీమ్‌ అయి సినిమాలు నిర్మిస్తాడట. కేవలం చిన్న సినిమాలనే కాకుండా భారీ చిత్రాలకి కూడా పవన్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడట.

చరణ్‌తో తన బ్యానర్లో తీద్దామని అనుకున్న సినిమా ప్రపోజల్‌ అలాగే వుంది. 'బాబాయ్‌ ఎప్పుడంటే అప్పుడు రెడీ' అని చరణ్‌ చాలా సందర్భాల్లో చెప్పాడు. కనుక పవన్‌ నటిస్తాడా లేదా అనే దానిపై సందేహాలు ఇంకా అలాగే వున్నా కానీ 'పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌' అయితే యాక్టివ్‌ కానుంది. అయితే ఆ పనులు కూడా ఎన్నికలు ముగిసిన తర్వాతే మొదలవుతాయట. ఈలోగా పూర్తి సమయాన్ని రాజకీయాలకే పవర్‌స్టార్‌ కేటాయిస్తున్నాడు.