పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్తా జనసేనాధిపతిగా మారిన దగ్గర నుంచి భారీగా పెంచిన గెడ్డంతోనే కనిపిస్తున్నారు. అయితే మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. పింక్ రీమేక్ స్టార్ట్ చేసారు. అప్పుడే గ్యాసిప్ లు వినిపించాయి. త్వరలో గెడ్డం తీసేస్తారని వార్తలు వినిపించాయి.
అయితే పింక్ లో రెండు షేడ్ లు వున్నాయని, గెడ్డంతో తీయాల్సిన సీన్లు ముందు తీసేసిన తరువాత క్లీన్ షేవ్ కు వస్తారని కూడా వినిపించింది. మొత్తానికి పవన్ పని చేసిన ఫస్ట్ షెడ్యూలు పూర్తయిపోయింది. ఇప్పుడు పింక్ కు కాస్త గ్యాప్ ఇచ్చి క్రిష్-ఎఎమ్ రత్నం సినిమా మీదకు రాబోతున్నారు.
అయితే క్రిష్ సినిమా మీదకు రావడమే క్లీన్ షేవ్ తో వస్తారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఓ వారం క్రిష్ సినిమా మీద వర్క్ చేసి, ఆపేస్తారు. పింక్ రీమేక్ పూర్తి చేసిన తరువాత మళ్లీ ఆ సినిమా సెట్ కు వెళ్తారు. మొత్తానికి క్రిష్ సినిమాను క్లీన్ షేవ్ తో ప్రారంభించి, అదే లుక్ ను పింక్ కు కంటిన్యూ చేస్తారు.
సో, పవన్ ఫ్యాన్స్ బీ రెడీ. మళ్లీ వాళ్ల ఇష్టపడే పవర్ స్టార్ లుక్ ఎక్కడో అక్కడ ఎలాగూ బయటకు వస్తుంది. చూసి హ్యాపీగా ఫీల్ కావచ్చు.