పవన్‌కళ్యాణ్‌తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న చిత్రం ఏ జోనర్‌కి చెందినది, ఈ చిత్రం కథాకమామీషు ఏమిటి వగైరా విషయాల గురించి అవగాహన లేకుండానే బయ్యర్లు దీనిపై భారీగా పెట్టుబడి పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతగా క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై కన్‌ఫ్యూజన్ నెలకొంది.
షూటింగ్ వేగంగా జరుగుతున్నప్పటికీ గ్రాఫిక్స్ పాత్ర ఎక్కువే వుండడంతో అంత త్వరగా ఈ చిత్రం పూర్తి కాదని, అనుకున్న టైమ్‌కి ప్రొడక్షన్ వర్క్ పూర్తయినా కానీ పోస్ట్ ప్రొడక్షన్‌కి కనీసం రెండు నెలల సమయం పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్ర నిర్మాత రాధాకృష్ణ మాత్రం సెప్టెంబర్ 21న విడుదల చేస్తామని చెప్పినట్టు వార్తలొచ్చాయి.
ఇప్పటికీ దసరా సీజన్లో ఈ చిత్రం రావడం ఖాయమని యూనిట్ సభ్యులు చెబుతుండగా, దసరాకి వచ్చే అవకాశం లేదని, సంక్రాంతికి వాయిదా పడుతుందనే రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఈ కన్‌ఫ్యూజన్ వల్ల ఆ సీజన్లలో ప్లాన్ చేస్తోన్న ఇతర చిత్రాలకి ఇబ్బందిగా పరిణమించింది.
అవే సీజన్లలో మరికొన్ని భారీ చిత్రాల విడుదల ఖరారవడంతో పవన్ సినిమా కూడా ఉన్నట్టయితే మిగతావాటి ప్లాన్స్ మార్చుకోవాల్సి వస్తుంది. మరి దీనిపై త్రివిక్రమ్ అండ్ టీమ్ ఎప్పటికి క్లారిటీ ఇస్తారో?