మెగా హీరోలంతా తమిళ సినిమాల్ని తెలుగులోకి రీమేక్ చేయడమ్మీద ఫోకస్ పెట్టారు. చిరంజీవి 'కత్తి'ని రీమేక్ చేస్తోంటే, రామ్‌చరణ్ 'తని ఒరువన్' రీమేక్‌లో నటిస్తున్నాడు. ముందుగా స్ట్రెయిట్ సినిమా అనుకున్న పవన్‌కళ్యాణ్ కూడా ఇప్పుడు రీమేక్ మీద మనసు పారేసుకున్నాడు. అజిత్ హీరోగా తమిళంలో వచ్చిన 'వీరమ్' రీమేక్‌లో పవన్‌కళ్యాణ్ నటించడం ఖాయమైపోయింది.
అయితే, ఇక్కడ చిన్న మార్పు కూడా వుందండోయ్. తమిళ 'వీరమ్'లో అజిత్ తెల్లగడ్డంతో మధ్యవయస్కుడిలా కనిపిస్తాడు. పంచెకట్టులో అజిత్ ఆ సినిమాలో చాలా డైనమిక్‌గా కనిపించి, తన లుక్‌తోనే సినిమాకి విపరీతమైన హైప్నీ, రిలీజయ్యాక సక్సెస్‌నీ అందించాడు. తెలుగులోనూ పవన్‌కళ్యాణ్ లుక్ అలాగే వుంటుందని అంతా అనుకున్నారుగానీ, ఎందుకో పవన్ రిస్క్ చేయాలనుకోవట్లేదట.
మరీ తెల్లగడ్డంతో కాకుండా, హ్యాండ్సమ్ లుక్‌తోనే కనిపించాలని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'గోపాల గోపాల' ఫేం డాలీ దర్శకత్వం వహిస్తాడు. అజిత్ తరహాలో తెల్లగడ్డం, నెరిసిన జుట్టు, తెల్ల పంచెలో లుక్ టెస్ట్ చేసి, ఆ తర్వాత ఆ గెటప్ తెలుగు నేటివిటీకి సూటవదనుకుని, పూర్తిగా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా హ్యాండ్సమ్ లుక్‌లో మరో టెస్ట్ డాలీ చేయించాడట. ఆ లుక్ ఓకే అవడంతో త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశముంది.
అన్నట్టు, షరామామూలుగానే పవన్‌కళ్యాణ్ ఈ సినిమా విషంలోనూ 'వేలు' బాగానే పెట్టేస్తున్నాడట. తమిళ వెర్షన్కన్నా తెలుగులో చాలా మార్పులు చేర్పులు వుంటాయట. అవన్నీ పవన్‌కళ్యాణ్ చేసినవేనని సమాచారం.