పవన్… లాయర్..దొంగ..పోలీస్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎడా పెడా సినిమాలు ఓకె చేసి పక్కన పెడుతున్నారు. అందరికన్నా ముందుగా కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు. ఆయన సినిమా, ఆ అడ్వాన్స్ అలాగే వుండగానే మైత్రీ మూవీస్ దగ్గర…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎడా పెడా సినిమాలు ఓకె చేసి పక్కన పెడుతున్నారు. అందరికన్నా ముందుగా కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు. ఆయన సినిమా, ఆ అడ్వాన్స్ అలాగే వుండగానే మైత్రీ మూవీస్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు. ఈ రెండు సినిమాల సంగతి అలా వుండగానే జనసేన వ్యవహారాల్లో సాయం చేసిన రామ్ తాళ్లూరికి ఓ సినిమా చేయాలనుకున్నారు.

ఇన్ని కమిట్ మెంట్లు వుండగానే నిర్మాత దిల్ రాజు కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన వకీల్ సాబ్ మొదలుపెట్టారు. అది కాస్తా కరోనా కారణంగా ఆగింది. ఇలాంటి నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ కు కూడా సినిమా చేస్తారని మాట ఇచ్చినట్లు వార్తలు వచ్చేసాయి. ఇక పవన్ కు సన్నిహితమైన హారిక హాసిని బ్యానర్ వుండనే వుంది. ఎన్ని సినిమాలు చేసినా, 2023 డిసెంబర్ లోపుగానే చేయాలి. అప్పుడు మళ్లీ ఎన్నికల సమయం ముందుకు వచ్చేస్తుంది.

ఇదిలా వుంటే పవన్ ఒప్పుకుంటున్న సినిమాల సంగతి ఎలా వున్నా, ఒప్పుకుంటున్న పాత్రలు భలేగా వున్నాయి. వకీల్ సాబ్ లో లాయర్ పాత్ర. క్రిష్ సినిమాలో పెద్దోళ్లను దోచి పేదలకు పంచే దొంగ పాత్ర, హరీష్ శంకర్ సినిమాలో పోలీసు పాత్ర ఇప్పటికి ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి ఏం చేస్తారో కానీ,

బండ్ల గణేష్ సినిమాలో పెద్దంటి లో అన్న లాంటి ఫ్యామిలీ క్యారెక్టర్ వుంటుందని తెలుస్తోంది. అందువల్ల సురేందర్ రెడ్డి పోలిటిషియన్ క్యారెక్టర్ ను టచ్ చేస్తే, అన్ని రకాల క్యారెక్టర్లు వరుసగా చేసేసినట్లు అవుతుంది. కానీ నిజానికి ప్రస్తుతం పవన్ వున్న గెటప్ కు ఆయనకు ఇష్టమైన యోగిపాత్ర సూటవుతుంది. దాంతో ఎవ్వరూ కథ తయారుచేయడం లేదేమో?

ఎలిమినేషన్ తట్టుకోలేకపోయాను