పవన్- పది నెలల్లో మూడు

రాజకీయాల కోసం వదిలేస్తున్నా అని చెప్పి గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా వున్న పవన్ కళ్యాణ్ ఆ ఒట్టు తీసి గట్టున పెట్టి వరుసగా సినిమాలు చేస్తున్నారు. పైగా నాకు వ్యాపారాలు లేవు అంటూ…

రాజకీయాల కోసం వదిలేస్తున్నా అని చెప్పి గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా వున్న పవన్ కళ్యాణ్ ఆ ఒట్టు తీసి గట్టున పెట్టి వరుసగా సినిమాలు చేస్తున్నారు. పైగా నాకు వ్యాపారాలు లేవు అంటూ తనకు తానే ఎవ్వరూ అడగని సంజాయిషీ ఇస్తున్నారు. 

మానమని అడిగిన వారు లేరు. మళ్లీ ఎందుకు చేస్తున్నారని అడిగిన వారు లేరు. అదంతా ఆయనకు ఆయనే చేసుకున్న, చేసుకుంటున్న వ్యవహారం. 

ఇలాంటి నేపథ్యంలో అయిదు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు విడుదల చేయడానికి రంగం సిద్దం అయిపోయింది. ఏప్రిల్ 9న పింక్ రీమేక్ వకీల్ సాబ్ విడుదల ఫిక్స్ చేసేసారు. 

అలాగే మరో సినిమా విడుదల వినాయకచవితి (సెప్టెంబర్) కు ప్లాన్ చేస్తున్నారు. అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ ను సెప్టెంబర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. 

ఇది కాక క్రిష్ డైరక్షన్ లో తయారయ్యే సినిమాను 2021 సంక్రాంతి విడుదల టార్గెట్ గా రెడీ చేస్తున్నారు. రెండు మూడు నెలల్లో అయ్యప్పన్ షూట్ అయిపోయిన దగ్గర నుంచి క్రిష్ సినిమా స్టార్ట్ అవుతుంది. 

షాట్..టేక్..యాక్షన్..ఓకె అంటూ చకచకా రెడీ చేస్తారు అంతే తప్ప రీటేక్ లు, ఇంప్రూవైజేషన్లు వంటి టైమ్ టేకింగ్ వ్యవహారాలు పవన్ సినిమాలో వుండవు అని ఇండస్ట్రీటాక్. 

కాబట్టి విడుదల డేట్ టార్గెట్ తో సమస్య లేదు. మొత్తం మీద పదినెలల్లో మూడు సినిమాలు అంటే పెద్ద హీరోల సినిమాల పరంగా రికార్డ్ నే.

బాబు వెరీవెరీ ఇంపార్టెంట్ హామీని ఎలా మ‌రిచార‌బ్బా?

కబుర్లు చెప్పడంలో దిట్ట పవన్ కల్యాణ్..

చంద్రబాబుకు ఏజెంట్‌లా పనిచేస్తున్న నిమ్మగడ్డ..