విడాకుల ఊహాగానాలు.. ఆ పత్రికపై నటి దావా!

కేవలం వివాహం అయిన 117 రోజులకే నిక్ జోనస్ – ప్రియాంక చోప్రా విడాకులకు సిద్ధం అయినట్టుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలన్నింటికీ మూలం ఒక మ్యాగజైన్ ‘ok!’ అనే ఇంగ్లిష్…

కేవలం వివాహం అయిన 117 రోజులకే నిక్ జోనస్ – ప్రియాంక చోప్రా విడాకులకు సిద్ధం అయినట్టుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలన్నింటికీ మూలం ఒక మ్యాగజైన్ ‘ok!’ అనే ఇంగ్లిష్ మ్యాగజైన్ ప్రియాంక దాంపత్యం మీద ఒకింత సంచలన కథనమే ఇచ్చింది.

నిక్- ప్రియాంకలు పెళ్లి చేసుకున్న తర్వాత అనేక విషయాల్లో వారిలో కలహాలు చెలరేగాయని, ఒకటని కాదు.. ప్రతిదాంట్లోనూ వారికి గొడవే అని ఆ మ్యాగజైన్ అంతా తనే చూసినట్టుగా రాసింది. పని విషయంలో, పేమెంట్ విషయంలో, కలిసి గడపడం విషయంలో.. ఇలా ప్రతిదాంట్లోనూ నిక్- ప్రియాంకలు గొడవ పడుతూ ఉన్నారని ఆ మ్యాగజైన్ పేర్కొంది.

ఈ కథనం సంచలనం రేపింది. ఇండియా మీడియా కూడా షాక్ అయ్యింది. పెళ్లై సరిగ్గా నాలుగు నెలలు అయినా గడవకముందే వారిద్దరూ విడిపోతున్నారా అని సినీప్రియులు కూడా ఆశ్చర్యపోయారు. వీళ్ల పెళ్లి విషయంలోనే చాలామంది ఆశ్చర్యపోయారు. ఇంతలోనే విడాకులు అంటే మరింత ఆశ్చర్యం తప్పదు కదా. అదే జరిగింది.

అయితే ఇప్పుడు మరో ఆఫ్ ద రికార్డ్ వార్త ఏమిటంటే, తమ దాంపత్యం మీద కథనం రాసిన మీడియా మీద కోర్టుకు ఎక్కనున్నారట నిక్- ప్రియాంక. తాము విడాకులు తీసుకున్నట్టుగా కథనం రాసిన మ్యాగజైన్ మీద వారు దావాకు రెడీ అయ్యారని సమాచారం! అంటే విడాకుల ఊహాగానాలను నిక్- ప్రియాంకలు గట్టిగా ఖండిస్తున్నట్టే కదా!

జనసేన 17 స్థానాల్లో మొదటి స్థానం.. మిగతాచోట్ల మూడోస్థానం