cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

అరవింద సమేత: పాట హిట్.. ప్లేస్ మెంట్ ఫ్లాప్

అరవింద సమేత: పాట హిట్.. ప్లేస్ మెంట్ ఫ్లాప్

పెనిమిటి సాంగ్.. తమన్ కంపోజ్ చేసిన ది బెస్ట్ సాంగ్స్ లో ఒకటి. సంగీతమే కాదు, సాహిత్యం పరంగా కూడా ఈ పాటకు తిరుగులేదు. మనసుకు హత్తుకునే పదాలవి. అలాంటి పాటకు అరవింద సమేతలో అన్యాయం జరిగింది. టోటల్ ఆల్బమ్ లో సూపర్ హిట్ అయిన ఈ పాటకు సినిమాలో తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదు.

అవును.. అరవింద సమేత సినిమాలో రాంగ్ ప్లేస్ లో వస్తుంది పెనిమిటి సాంగ్. ఎలాంటి సందర్భం లేకున్నా, కేవలం ఆ పాటను పెట్టడం కోసం ఎన్టీఆర్ తో కొన్ని డైలాగ్స్ చెప్పించి పాటను కొనసాగిస్తారు. అలా ఇరికించడమే కాకుండా, చిత్రీకరణలో కూడా పాటకు అన్యాయం చేశారు.

వెస్ట్రన్ బ్యాక్ డ్రాప్, పొట్టి నిక్కర్లు వేసుకున్న అమ్మాయిలు, పార్టీ కల్చర్ ను తలపించే సెట్.. ఇలా అన్నీ కలిసి పాటలో ఎమోషన్ ను పీల్చేశాయి. పైగా ఈ పాటకు కూడా అక్కడక్కడ ఎన్టీఆర్ చిన్న స్టెప్స్ వేయడం నప్పలేదు. ఓవరాల్ గా పాటపై సరిగ్గా వర్కవుట్ చేయలేదనే విషయం స్క్రీన్ పై చూస్తే అర్థమైపోతుంది.

నిజానికి ఈ పాటకు సంబంధించి 2 వెర్షన్లు రెడీ చేశాడు త్రివిక్రమ్. ఫిమేల్ వాయిస్ లో పాడిన పాట కూడా ఉంది. దాన్ని తొలిగించి ఇలా మేల్ వాయిస్ లో పాడిన పాటను ఉంచారు. అయినప్పటికీ దానికి సరైన ప్లేస్ మెంట్ కుదరలేదు.