బోయపాటి శ్రీనివాస్-బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా టీజర్లు చూసిన వారికి ముందుగా, అత్యంత ప్రామినెంట్ గా రుషి పంజాబీ పేరు కనిపిస్తుంది. అతగాడు ఆ సినిమాకు సినిమాటోగ్రాఫర్. దర్శకుడు బోయపాటి ఏరికోరి తెచ్చుకున్న సినిమాటోగ్రాఫర్ అతను. నిజానికి రుషి పంజాబీ టాప్ ఏడ్ ఫిల్మ్ మేకర్లలో ఒకరు. అలాంటి రుషిని ఏరికోరి సరైనోడు సినిమాకు తెచ్చుకున్నాడు బోయపాటి శ్రీనివాస్.
ఆ సినిమాలో బోయపాటి మాస్ ఏంగిల్స్ కు రుషి సినిమాటోగ్రఫీ ఏంగిల్స్ తోడయ్యాయి. అందుకే మళ్లీ జయ జానకీ నాయక సినిమాకు కూడా అతన్నే ఫిక్స్ చేసుకున్నాడు. రుషి పంజాబీ ఫీజు అయితేనేం, అతగాడి ఎక్విప్ మెంట్, స్టాఫ్, ప్రత్యేకమైన లైటింగ్ ఇతరత్రా ఖర్చులయితేనేం, నాలుగు నుంచి నాలుగున్నర కోట్లు అయిందట. కానీ అంత ఖర్చయినా అంతకు అంతా క్వాలిటీ వుంటుందని, నిర్మాతలు సై అన్నారట. టీజర్లలో క్వాలిటీ తెలుస్తోంది. ట్రయిలర్ వస్తే ఇంకా క్లియర్ అవుతుందేమో?
అన్నట్లు ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా పని చేసిన దేవీ శ్రీ ప్రసాద్ రెమ్యూనిరేషన్ రెండున్నర కోట్లు.