Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పింక్ నుంచి తివిక్రమ్-హారిక అవుట్

పింక్ నుంచి తివిక్రమ్-హారిక అవుట్

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సినిమాకు ఆదిలోనే సెట్ బ్యాక్ ఎందురయింది. ఈ ప్రాజెక్టు నుంచి డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్-నిర్మాణ సంస్థ హారిక హాసిని పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది. పింక్ రీమేక్ స్క్రిప్ట్ త్రివిక్రమ్ తయారుచేయడానికి, హారిక హాసిని సంస్థ భాగస్వామ్యం తీసుకోవడానికి మొదటి నుంచీ ఆసక్తిగా వున్నాయి.

కానీ మధ్యలో ఏం జరిగిందో కానీ, ఇప్పుడు త్రివిక్రమ్, హారిక రెండూ మిడిల్ డ్రాప్ అయినట్లే. నిర్మాత దిల్ రాజు వ్యవహార శైలి, వేణు శ్రీరామ్ చేతనే స్క్రిప్ట్ రాయించుకోవాలనే ఆయన ఆలోచన పసిగట్టి, త్రివిక్రమ్-హారిక తప్పుకున్నట్లు తెలుస్తోంది.

మరి త్రివిక్రమ్-హారిక తప్పుకున్నారు అని తెలిసిన తరువాత పవన్ కళ్యాణ్ సినిమా చేస్తారా? అన్నది తెలియాల్సి వుంది. చేస్తారనే వినిపిస్తోంది. ఇదిలా వుంటే కుటుంబ పరంగా వైకాపా బంధాలు వున్న దిల్ రాజు ఇప్పుడు పవన్ తో సినిమా చేస్తే, రాజకీయంగా కూడా సమస్య అవుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ చాలా ఎక్కువగా జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.

అలాంటి టైమ్ లో వైకాపా ఎమ్మెల్యేతో సంబంధం కలుపుకున్న దిల్ రాజు ఈ నిర్మాణం చేపట్టడం అంత సరైనది కాదు అనే డిస్కషన్ వైకాపా టాప్ వర్గాల్లో మొదలయిందని బోగట్టా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?