పొట్టి డ్రస్సులేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది చాన్నాళ్ళుగా. అయితే ఈ మధ్య అందాల భామల వస్త్రధారణ మరీ దారుణంగా వుంటోంది. అంత దారుణంగా డ్రస్సులేసుకోవడమే కాదు, ఆ డ్రస్సులతో ఇబ్బంది పడ్తున్నట్టుగా ‘నటిస్తుండడం’ అంతకన్నా దారుణమైన విషయం.
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆమె పొట్టి డ్రస్సుని సర్దుకోవడానికి నానా తంటాలూ పడింది. ‘ఊప్స్ మూమెంట్..’ అంటూ బాలీవుడ్ మీడియా ఆమె ఫొటోల్ని హైలైట్ చేసింది. మరోపక్క, మరో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే కూడా ఇదే పని చేసింది. తన తాజా చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటూ, ఆ కార్యక్రమానికి ఓ పొట్టి డ్రస్సు వేసుకొచ్చింది. అది స్విమ్ సూటా? లేదంటే నైట్ డ్రస్సా.? అనేది ఎవరికీ అర్థం కాలేదు. ఆమె కూడ ఇబ్బంది పడింది ఆ డ్రస్‌లో.
ఏమన్నా అంటే, ‘ఎప్పుడూ మీ చూపు అలాగే ఎందుకు వుంటుంది.? గ్లామర్‌ని అర్థం చేసుకోండి.. స్టయిల్‌ని ఫాలో అవ్వండి.. స్టయిలిష్‌గా డ్రస్ వుందా? లేదా? అన్నదే ఆలోచించండి..’ అంటూ అటు అలియా, ఇటు దీపికా తమ పొట్టి డ్రస్సుల వ్యవహారంపై స్పందించారు. అవునా.. అలాగైతే చాలీచాలని బట్టలేసుకుని.. ఇబ్బందికరంగా ఫీలవడమెందుకు.. సర్దుకున్నా ఉపయోగం లేదని తెలిసీ సర్దుకునేందుకు ప్రయత్నించడమెందుకు.? అన్న ప్రశ్న ఎదురవుతోంది వారికి.