ఫ్లాపుల్లో వున్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ కొట్టింది గబ్బర్ సింగ్ సినిమాతో. ఆ సినిమా నిర్మాత బండ్ల గణేష్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కూడా ఆర్జీవీ పవర్ స్టార్ సినిమాలో వుండబోతోందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను,
ఆయన చుట్టూవుండే జనాలను, జనసేన వ్యవహారాలను సింబాలిక్ గా, అన్యాపదేశంగా చూపిస్తూ, మనుషుల్ని పోలిన మనుషులను నటులుగా పెట్టి ఆర్జీవీ పవర్ స్టార్ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, ఆయన భార్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ లను పోలిన క్యారెక్టర్లు వుంటాయన్న సంగతి ఇప్పటికే వదిలిన స్టిల్స్ ద్వారా బయట పడింది. మరి ఇప్పటి వరకు బండ్ల గణేష్ ను పోలిన క్యారెక్టర్ వుందీ అన్న సంగతి బయటకురాలేదు. పైగా ఇటీవల చాలా కాలంగా బండ్ల గణేష్ సినిమాల పరంగా యాక్టివ్ గా లేరు. మరి ఎన్నికల అనంతరం జరిగిన కథ అంటూ, బండ్లను ఏ విధంగా సీన్ లోకి తీసుకువస్తున్నారో ఆర్జీవీ కే తెలియాలి.
ఇదిలా వుంటే పలు చిన్న సినిమాలు తీసిన నిర్మాత రామ సత్యనారాయణ ఇదే సినిమాలో ఓ క్యారెక్టర్ పోషిస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆయనేం పాత్ర పోషిస్తున్నారో తెలియాల్సి వుంది.