Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రభాస్ ఎందుకు బెస్ట్ కాలేదు?

ప్రభాస్ ఎందుకు బెస్ట్ కాలేదు?

మాటీవీ ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ అవార్డు అందుకున్నాడు. ఈ వైనం ఇండస్ట్రీ సర్కిళ్లలో గుసగుసలకు దారితీసింది..బాలయ్యతో నాగ్ కు, చిరుకు సరిపడని వైనం, అలాగే చంద్రబాబుతో రాజకీయ వైరుధ్యం తదితర లెక్కలన్నీ ఈ అవార్డు వెనుక వున్నాయని టాక్ వినిపిస్తోంది. మాటీవీ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ విలన్, ఉత్తమ ఫిమేల్ సపోర్టింగ్ ఇవన్నీ బాహుబలికి వచ్చాయి కానీ, ప్రభాస్ ఉత్తమ హీరో కాలేకపోయాడు.

 పైగా అదే ఏడాది మహేష్ బాబు శ్రీమంతుడు కూడా వుంది. కానీ బాహుబలి, శ్రీమంతుడుల ముందు ఏవరేజ్ సినిమాగా మిగిలిన టెంపర్ కు మాత్రం ఉత్తమ హీరో అవార్డు దక్కింది.  ఇదంతా మెగా క్యాంప్, నాగార్జున కలిసి చేసిన ప్లాన్ తప్ప వేరు కాదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే తారక్ ఎప్పుడో ఓ ఇంటర్వూలో చిరు ఎవరు అని కామెంట్ చేసిన వైనాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు.

 కేవలం చంద్రబాబు, బాలయ్య తో సరిపడని కారణంగా, శతృవు..శతృవు మన మిత్రుడు అన్న ఈక్వేషన్ తో ఎన్టీఆర్ ను బెస్ట్ ఏక్టర్ చేసారని విమర్శలు వినిపిస్తున్నాయి. మాటీవీ ని స్టార్ సంస్థ కొనేసినా కూడా, దాని వ్యవహారాల్లో నాగ్, చిరంజీవిల హవాయే నడుస్తోందనడానికి ఇదే సాక్ష్యమని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?