మరి వాస్తవంగా ప్రభాస్ బాహుబలి తర్వాతి సినిమాలకు ఎంత తీసుకుంటున్నాడు.. అనేది ఆయనకు, ఆయనకు రెమ్యూనరేషన్ ఇచ్చే నిర్మాతలకే తెలియాలి కానీ.. పుకార్లలో మాత్రం ప్రభాస్ రేంజ్ భారీ స్థాయికి చేరిపోయింది.
అదెంత వరకూ వెళ్లిందంటే.. ప్రభాస్ ప్రస్తుతం రూ.80 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తున్నాడు.. అనేంత వరకూ!
ప్రభాస్ ను సల్మాన్ ఖాన్ ను పెట్టి రోహిత్ షెట్టి ఒక మల్టీ స్టారర్ ను ప్లాన్ చేశాడని.. దానికి గానూ ప్రభాస్ రూ.80 కోట్ల రూపాయల పారితోషకాన్ని డిమాండ్ చేస్తున్నాడని ఒక ఆంగ్ల పత్రిక రాసింది. అది వైరల్ గా మారింది.
సల్లూ.. ప్రభాస్ కాంబోలో సినిమా అంటే దానికి ప్రచారం రాదా మరి. ఆ సినిమాకు అడ్డంకి ప్రభాసే అని కూడా ఆ పత్రిక పేర్కొంది. ప్రభాస్ రూ.80 కోట్లు అడుగుతున్నాడని.. దీంతోనే సినిమా పట్టాలెక్కడం లేదని పేర్కొంది.
అయితే ఈ పుకారు ఎలా పుట్టిందో తనకే తెలియదని రోహిత్ షెట్టి స్పందించడంతో వ్యవహారం తేలిపోయింది. సల్లూనో, ప్రభాసో రియాక్ట్ కావాలంటే దానికి సమయం పట్టేది.. అయితే రోహిత్ షెట్టి మాత్రం త్వరగా రియాక్ట్ అయ్యాడు.
ఇప్పుడు తను కేవలం తన ప్రస్తుత సినిమా మీదే దృష్టి సారించాను తప్ప.. మరే సినిమా మీదా కాదని ఆయన స్పష్టం చేశాడు. అసలు ఈ పుకారు ఎలా పుట్టిందో కూడా తనకు తెలియదని అనేశాడు. దీంతో.. ప్రభాస్, సల్లూ కాంబోలో సినిమా ఒట్టి పుకారని తేలిపోయింది.
గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పుకార్లలో అయినా ప్రభాస్ పారితోషకం కనీవినీ ఎరగని స్థాయికి చేరడం. ఎనభై కోట్లు అంటే.. అంత మొత్తం వసూలు చేసిన సినిమాలను సూపర్ హిట్ గా పరిగణిస్తున్న దశలో ఉన్నాం మనం.
ఇలాంటి పరిస్థితుల నడుమ అది పుకారుగా అయినా రూ.80 కోట్లు అంటున్నారంటే.. ప్రభాస్ రేంజ్ ను పుకార్ల సృష్టికర్తలు చాలా చాలా పైకి తీసుకెళ్తున్నారనే చెప్పాలి.