ప్రభాస్ ​’​సాహో​’​ రిహార్సల్

పాటల కోసం రిహార్సల్స్ చేయడం కామన్. కష్టమైన కొన్ని స్టెప్స్ ను హీరోహీరోయిన్లు 2 రోజుల ముందే ప్రిపేర్ అవుతారు. అయితే ఫైట్స్ కోసం రిహార్సల్స్ చేయడం మాత్రం చాలా తక్కువ. సాహో సినిమాకు…

పాటల కోసం రిహార్సల్స్ చేయడం కామన్. కష్టమైన కొన్ని స్టెప్స్ ను హీరోహీరోయిన్లు 2 రోజుల ముందే ప్రిపేర్ అవుతారు. అయితే ఫైట్స్ కోసం రిహార్సల్స్ చేయడం మాత్రం చాలా తక్కువ. సాహో సినిమాకు సంబంధించి ఫైట్స్ కోసం ప్రత్యేకంగా రిహార్సల్స్ చేస్తున్నాడు ప్రభాస్.

సాహో సినిమాలో యాక్షన్ సన్నివేశాలే కీలకం. ఈ ఫైట్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ను తీసుకున్నారు. చాలా క్లిష్టమైన ఈ ఫైట్స్ కోసం కాస్త ముందుగానే ప్రిపేర్ అయితే బాగుంటుందని నిర్ణయించిందట యూనిట్. అందుకే యాక్షన్ సీక్వెన్స్ కోసం ఇప్పట్నుంచే రిహార్సల్స్ మొదలుపెట్టింది.

సాహో సినిమా షూటింగ్ త్వరలోనే దుబాయ్ లో ప్రారంభం అవుతుంది. ప్రతిష్టాత్మక బుర్జ్ ఖలీఫా టవర్ వద్ద కొన్ని ఫైట్ సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. ఈ ఫైట్స్ కోసమే ప్రభాస్ కాస్త ముందుగానే ప్రిపేర్ అవుతున్నాడు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సాహో సినిమా రాబోతోంది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. మేజర్ షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. అనుష్కను  హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉంది.