ప్రదీప్ ఇక మూడేళ్లు నో డ్రయివింగ్

డ్రైవింగ్ లైసెన్స్ వుంటే కదా డ్రయివ్ చేయడం. అది లేకపోతే సమస్యే లేదు. డ్రయివర్ ను పెట్టుకోవచ్చు. అలాంటపుడు లైట్ గా రెండు పెగ్గులు వేసినా పెద్ద నష్టం లేదు.  Advertisement ఏంకర్ ప్రదీప్…

డ్రైవింగ్ లైసెన్స్ వుంటే కదా డ్రయివ్ చేయడం. అది లేకపోతే సమస్యే లేదు. డ్రయివర్ ను పెట్టుకోవచ్చు. అలాంటపుడు లైట్ గా రెండు పెగ్గులు వేసినా పెద్ద నష్టం లేదు. 

ఏంకర్ ప్రదీప్ కు ఇప్పుడు ఇదే పాజిటివ్ థింకింగ్. ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ ను కోర్టు మూడేళ్ల పాటు సస్పెండ్ చేసింది. కాస్త జరిమానా విధించింది. ఆ విధంగా ప్రదీప్ అదృష్టవంతుడే.

170పాయింట్లు దాటితే జైలు శిక్ష తప్పదని అందరూ ఊహాగానాలు చేసారు. కానీ అదృష్టం కొద్దీ ప్రదీప్ ఈ డ్రయివింగ్ లైసెన్స్ సస్పెన్షన్, జరిమానాతో బయటపడ్డారు.

నిజానికి ప్రదీప్ కు డ్రయివర్ ఎప్పుడూ వుంటాడు. కానీ ప్రదీప్ కు డ్రయివింగ్ సరదా. డ్రయివర్ ను కేవలం తను బండి దిగాక పార్కింగ్ కోసం వాడుకుంటాడు.

ఇకపై డ్రయివర్ కే డ్రయివింగ్ బాధ్యత అప్పగించి, తాను రిలాక్స్ కావచ్చు. అలాంటపుడు ఇక డ్రంక్ అండ్ డ్రయివింగ్ సమస్యే వుండదు.