Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రకాష్ రాజ్ కు చిరు మద్దతు!

ప్రకాష్ రాజ్ కు చిరు మద్దతు!

తెలుగు సినిమా రంగ నటీనటుల సంఘం మా ఎన్నికలు ఈసారి కూడా సంచలనం సృష్టించేలా వున్నాయి. కన్నడ నటుడు ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. 

అధికారికంగా ప్రకటించకపోయినా, హీరో మంచు విష్ణు పోటీ పడతారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల కోసం గత రెండు నెలలుగా సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఎన్నికలకు మెగాస్టార్ మద్దతు కీలకం కాబట్టి, ముందుగానే ఆయనను సంప్రదించి, అనుమతి, మద్దతు రెండూ తీసుకున్నారని టాలీవుడ్ లో వినిపిస్తోంది.

మంచు విష్ణు పోటీ చేస్తాడని ముందుగా తెలియదు. ఇప్పటకీ అధికారికంగా ఎక్కడా బయటకు రాలేదు. అందుకే మెగాస్టార్ ముందుగా తనను సంప్రదించిన ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇచ్చేసారని టాక్ వినిపిస్తోంది.  

గత కొన్నేళ్లుగా మా వ్యవహారాలు కాస్త అటు ఇటుగా వుంటూ వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కాస్త సమర్థత గలవారు పగ్గాలు చేపడితే బాగానే వుంటుంది. ఈ ఆలోచనతోనే ప్రకాష్ రాజ్ కు చిరు మద్దతు ఇచ్చేసారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?