కోకాపేట్ ఏరియాలో సైరా కోసం వేసిన భారీ సెట్ లో అగ్రిప్రమాదం సంబవించింది. దానివల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇది వార్త.. అయితే దీనివల్ల సైరా సినిమాకు వచ్చిన సమస్య ఏదీలేదని తెలుస్తోంది. ఎందుకంటే రెండురోజుల క్రితమే సైరా ప్యాచ్ వర్క్ కూడా దాదాపు పూర్తయిపోయిందని బోగట్టా. అంతేకాదు, సిజి వర్క్ వున్న ఎపిసోడ్ లు అన్నీ ఎప్పుడో ఫినిష్ చేసి, విజువల్ ఎఫెక్ట్ ల కంపెనీలకు పంపేసారు.
ఇప్పుడు ఏదైనా మిగిలిపోయింది అనుకున్నా, అది చాలా మైనర్ అని, అందువల్ల సెట్ ప్రమాదంతో సినిమా వర్క్ కు ఏ సమస్య లేదని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ప్రమాదం జరిగింది వర్కింగ్ హవర్స్ లో కాకపోవడంతో ప్రాణనష్టం ఏమీ జరుగలేదు. అదే అదృష్టం.
సైరా సినిమాను దసరా టార్గెట్ గా రెడీ చేయాలని ప్రయత్నంలో వుంది యూనిట్. అయితే దసరాకు విడుదల అన్నది విజవల్ ఎఫెక్ట్ కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీలు తమ వర్క్ పూర్తిచేయడం బట్టి వుంటుంది. ఒక్క కంపెనీకి కాకుండా వివిధ కంపెనీలకు ఇచ్చారు. వర్క్ చకచకా పూర్తవుతుందని, అయితే వీటిలో ఒకటే పెద్ద కంపెనీకి ఎక్కువ వర్క్ ఇచ్చారని తెలుస్తోంది. అది ఇన్ టైమ్ లో వచ్చేస్తే దసరా లేదూ అంటే సంక్రాంతి అని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.
ఈ ఘటనపై స్పందిస్తూ రామ్‌చరణ్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘కోకాపేటలో వేసిన సైరా సెట్ ఈ ఉదయం దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుంది. ఏ ఒక్కరికి ప్రమాదం జరగలేదు. చిత్రబృందం అంతా క్షేమంగా ఉంది. మా చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామ’ని ఫేస్‌బుక్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశారు.