పూరి జగన్నాధ్ ప్రస్తుతం టెంపర్ చేస్తున్నాడు ఎన్టీఆర్ తో. మరో వారం రోజులతయితే పూరి ఖాళీ. మిగిలిన డైరక్టర్లయితే ఓకె కానీ, పూరి ఖాళీగా వుండే టైపు కాదు. రెండు రోజుల్లో కథ ఆలోచించి, వారం రోజుల్లో స్క్రిప్ట్ రాసి, రెండు నెలల్లో సినిమా తీసేసే రకం. మహేష్ తో సినిమా అనుకున్నారు. అది నిజం కాదని తేలిపోయింది. కళ్యాణ్ రామ్ ను దువ్వుతున్నాడని వార్తలు వినవచ్చాయి. ముకుంద హీరో వరుణ్ తేజ తో సినిమా అని టాక్ వచ్చింది.
ఇప్పుడు ఏకంగా ప్రభాస్ పేరు వినిపిస్తోంది. ఇలా కాస్త స్కోప్ వున్న ప్రతి హీరోతో పూరి పేరు ముడిపెట్టి ఫీలర్లు వస్తున్నాయి. నిజానికి ఇందులో కాస్త సాధ్యం అనిపించే ఫీలర్ ఒక్క కళ్యాణ్ రామ్ తో మాత్రమే. ఎందుకంటే ఎన్టీఆర్ రికమెండ్ చేస్తే ఓకె అంటాడు. పైగా పూరి కూడా హిట్ కొట్టిన హీరోతో సినిమా చేయడానికి ముందుకు వచ్చేరకం. మహేష్, పవన్ కళ్యాణ్ లు బెస్ట్ ఎగ్జాంపుల్.
వరుణ్ తేజ ఇప్పట్లో రెడీ కాడు. ప్రభాస్ కనీసం ఆరు నెలల తరువాతే. అందువల్ల పూరి తరపున అభిమానులు ఎవరో ఇలా ఫీలర్లు పుట్టిస్తున్నారా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అవును వర్మ అంటే మాంచి ఆరాధన, అభిమానం వున్న విష్ణు-పూరి కాంబినేషన్ పై ఫీలర్లు ఎందుకు రావడం లేదో?