Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పెద్ద హీరోలను ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏం చేయలేదా?

పెద్ద హీరోలను ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏం చేయలేదా?

నిర్మాతలిద్దరూ గిల్డ్ గ్రూపులో సభ్యులే కాబట్టి వెనక్కి వెళ్లమని రిక్వెస్ట్ చేస్తే, దాన్నివాళ్లు సహృదయంతో స్వీకరించారంటూ గతంలో ఓ నిర్మాత స్టేట్ మెంట్ ఇచ్చాడు. మరి అల వైకుంఠపురం, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు సంబంధించి కూడా నిర్మాతలు సభ్యులుగానే ఉన్నారు. మరీ ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో డైరక్ట్ కాంటాక్ట్ ఉన్న దిల్ రాజు కూడా గిల్డ్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి ఎందుకీ పట్టుదల. ఎందుకీ ఇగో. వెనక్కి తగ్గొచ్చు కదా.

ఇదే దిల్ రాజు గతంలో ఇచ్చిన స్టేట్ మెంట్ ను ఓసారి చూద్దాం. "తెలుగులో హీరోలు, ద‌ర్శకులు, నిర్మాత‌లంద‌రూ బంగారాలు. ప‌రిస్థితి అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుంటే ఇబ్బందులు ఉండ‌వు." ఇదీ అప్పట్లో దిల్ రాజు ఇచ్చిన స్టేట్ మెంట్. మరి ఇప్పుడా బంగారం ఏమైంది? మహేష్ బాబు, అల్లు అర్జున్ లో ఏ ఒక్కరూ బంగారం కాదా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెప్పాలి. దిల్ రాజు భాషలో చెప్పాలంటే బన్నీ, మహేష్ ఎవ్వరూ నిర్మాతల ఇబ్బందుల్ని అర్థం చేసుకోలేదనే చెప్పాలి.

పండగ రోజుల్లో 2-3 పెద్ద సినిమాలు రావడంలో తప్పులేదని ఇదే దిల్ రాజు పదేపదే ప్రకటించారు. కానీ ఒకే రోజు రావడం మాత్రం తప్పు. ఈ విషయంలో గిల్డ్ సభ్యులు కలుగజేసుకోరు. చిన్న హీరోల విషయంలో రాజీలు కుదురుస్తూ, అవసరమైతే బెదిరిస్తూ తమ స్వలాభం చూసుకునే నిర్మాతలు కొందరు.. పెద్ద హీరోల దగ్గరకొచ్చేసరికి మాత్రం మూగవాళ్లుగా మారుతున్నారు. గ్యాంగ్ లీడర్, గద్దలకొండ గణేష్ విషయంలో అందర్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చిన దిల్ రాజు.. ఇప్పుడు కూడా అనీల్ సుంకర, అల్లు అరవింద్, చినబాబు లాంటి నిర్మాతల్ని ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడడం లేదు?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము మాత్రం ఎవ్వరికీ లేదు. టాలీవుడ్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఏటా వందల్లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ సక్సెస్ రేటు మాత్రం పట్టుమని 10శాతం కూడా ఉండడం లేదు. ఆ సక్సెస్ లో కూడా అగ్రభాగం సంక్రాంతి సీజన్ దే. అలాంటి సీజన్ ను కూడా అనవసర పట్టింపులకు పోయి నాశనం చేస్తున్నారు. ఇంకా స్ట్రయిట్ గా చెప్పాలంటే.. బడా హీరోల ఇగోల వల్ల బంగారు బాతు లాంటి సంక్రాంతి సీజన్ మార్కెట్ చేజారిపోయేలా ఉంది.

ఒకే రోజు రిలీజైనా ఫర్వాలేదు, అంకెల గారడీలతో హిట్ చేసుకోవచ్చనుకునే కొంతమంది స్వార్థానికి సంక్రాంతి సీజన్ కూడా బలిపశువుగా మారనుంది. అప్పుడు కూడా ఇదే ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఉంటుంది. తమ కళ్లతో అంతా చూస్తుంది.

రాంగ్ రూట్లో బాబు ఆత్మశోధన

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?