Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి చాన్స్ ను దెబ్బ తీసిన బ్రహ్మోత్సవం

పూరి చాన్స్ ను దెబ్బ తీసిన  బ్రహ్మోత్సవం

పూరి జగన్నాథ్ హడావుడిగా ఆ మధ్య మహేష్ తో సినిమా వుందంటూ ప్రకటించేసాడు. జనగణమన అన్న టైటిల్ కూడా ట్వీట్ చేసాడు. మహేష్-మురగదాస్ సినిమా తరువాత 24వ సినిమా పూరి సినిమా వుంటుంది. 25వ సినిమా మాత్రం ప్రెస్టీజియస్ ప్రాజెక్టు వుంటుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు బ్రహ్మోత్సవం ఫలితం కారణంగా లెక్కలు మారిపోయాయి. 

ఇప్పుడు మహేష్ కచ్చితంగా టార్గెట్ రీచ్ చేయగల డైరక్టర్లతో సినిమాలు చేయాలని చూస్తున్నాడు. మురగదాస్ సినిమా ఎలాగూ మంచి ప్రాజెక్టే. ఇది డిసెంబర్ నాటికి పూర్తి చేసి జనవరి నుంచి మరో సినిమా మీదకు వెళ్లాలని చూస్తున్నాడు. నిజానికి మురుగదాస్ సినిమా తరువాత కొరటాల శివ తో సినిమా చేయాలని మహేష్ అనుకున్నాడు. కానీ కొరటాల శివ తన జనతా గ్యారేజ్ తరువాతి సినిమా దానయ్యకే కచ్చితంగా చేయాల్సి వుంది. 

అందువల్ల మహేష్-కొరటాల శివ ఇప్పుడు ఇమ్మీడియట్ గా సినిమా చేయాలంటే, దానయ్యే నిర్మించాలి. బహశా ఈ కాంబినేషన్ సెట్ కావడం కష్టం. అందువల్ల ఈ లోగా మరో సినిమా చేయాలన్నది మహేష్ ఆలోచనగా తెలుస్తోంది. మురగదాస్ సినిమా తరువాత బహుశా వంశీ పైడిపల్లితొ ఓ సినిమా చేయాలన్న ఆలోచన కూడా వుంది. ఆ తరువాత కొరటాల శివ లైన్ లోకి వస్తాడు. 

అంటే ఈ మొత్తం సీన్ లో పూరి మిస్ అవుతున్నాడు. బహుశా పూరి సినిమా అంటే రిస్క్ కాస్త కన్నా ఎక్కువే వుంటుంది. పైగా మహేష్ ఇప్పుడు అస్సలు రిస్క్ తీసుకునే స్థితిలో లేడు. అందుకే పూరి చాన్స్ కు బ్రహ్మోత్సవం గండి కొట్టేటట్లే వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?