పూరి-చార్మి జాతకాలు బాగాలేవట

డ్రగ్స్ కేసులో కీలకంగా భావిస్తున్న దర్శకుడు పూరి జగన్నాధ్, హీరోయిన్ చార్మిల జాతకాలు అస్సలు బాగాలేవట. వేణు స్వామి అనే జ్యోతిష్కుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన తరచు సోషల్ నెట్ వర్క్ లో…

డ్రగ్స్ కేసులో కీలకంగా భావిస్తున్న దర్శకుడు పూరి జగన్నాధ్, హీరోయిన్ చార్మిల జాతకాలు అస్సలు బాగాలేవట. వేణు స్వామి అనే జ్యోతిష్కుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన తరచు సోషల్ నెట్ వర్క్ లో సెలబ్రిటీల జాతకాలు విశ్లేషిస్తుంటారు.

తాజగా డ్రగ్ కేసులో ఇన్ వాల్వ్ అయిన వారి జాతకాలు విశ్లేషించి, పూరి జీవితంలో ఈ మచ్చ తప్పదని, అది అంత సులువుగా మాసిపోదని, దానికి కారణం ఆ జాతకంలో వున్న లోపాలే అని తేల్చారు. అలాగే చార్మి జాతకంలో ఏలినాటి శని నడుస్తోందని, అందువల్ల ఆమెకు సమస్యలు తప్పకపోవచ్చని తేల్చారు. డ్రగ్స్ కేసులో ఇన్ వాల్వ్ అయిన చాలా మంది జాతకాల్లో సిమిలారటీలు వున్నాయని, అయితే అందరూ సెప్టెంబర్ 9తరువాత వీటి నుంచి బయటపడతారని ఆ జ్యోతిష్కుడు విశ్లేషించారు. 

అంతవరకు మాత్రం వీరంతా చాలా జాగ్రత్తగా వుండాలని సూచించారు. పోలీసు కేసుల్లో వీరంతా చిక్కుంటారని తాను ఈ ఏడాది ప్రారంభంలోనే హెచ్చరించానన్నారు. మొత్తం మీద సినిమాల వాళ్ల డ్రగ్స్ కేసు కేవలం మీడియాకే కాదు, జ్యోతిష్కులకు కూడా హడావుడి అందిస్తోంది.