Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి సినిమాలో నాగశౌర్య

పూరి సినిమాలో నాగశౌర్య

పూరి జగన్నాధ్, ఆయన మిత్రులు కలిసి ఓ చిన్న సినిమా చేసే ప్రయత్నంలో వున్నారు. దీని కోసం హీరోగా నాగశౌర్యను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాను పూరి డైరెక్ట్ చేస్తారో, సూపర్ వైజ్ చేస్తారో ఇంకా డిసైడ్ కాలేదు. అలాగే పూరి ఈ ప్రాజెక్టును తన సన్నిహితులైన నిర్మాతల్లో ఒకరికి కేటాయిస్తారని కూడా టాక్ వుంది. 

ఇదిలా వుంటే, జో అచ్యుతానంద తరువాత ప్రస్తుతం నాగశౌర్య రెండు సినిమాలు కమిట్ అయి వున్నాడు. ఒకటి సుకుమార్ నిర్మాణంలో. రెండవది సాయి కొర్రపాటి నిర్మాణంలో. సుకుమార్ సినిమా ఆలస్యం అయ్యేలా వుంది. అలాగే సాయి కొర్రపాటి సినిమాకు కుమార్ అనే కొత్త దర్శకుడు పని చేస్తారు. అదీ టైమ్ పడుతుంది. 

అందుకే ఈ లోగా పూరి సినిమా చేసే అవకాశాలు వున్నాయి. పూరి ప్రస్తుతం చేస్తున్న ఇజమ్ ప్రాజెక్టు దాదాపు పూర్తి కావచ్చింది. ఆ తరువాత ఎన్టీఆర్ తో చేయాలనే ఆలోచనలో వున్నారు. కానీ దానికీ సమయం వుంది. ఈ గ్యాప్ లో నాగశౌర్యతో సినిమా చేసేస్తారేమో మరి?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?