Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

పూరి ఫిక్స్.. ప్రొడ్యూసర్ ఎవరో?

పూరి ఫిక్స్.. ప్రొడ్యూసర్ ఎవరో?

మొత్తానికి పూరి జగన్నాధ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ ఫిక్స్ అయిపోయినట్లే. ఈ మేరకు వ్యవహారం సెటిల్ అయింది. ఇక మిగిలింది సినిమా ప్రొడ్యూసర్ ఎవరు అన్నది? మైత్రీమూవీస్ ఇందుకు రెడీగా వుంది. కానీ పూరి జగన్నాధ్ కు రెండు కండిషన్లు వున్నాయి. ఒకటి తమ బ్యానర్ యాడ్ అవ్వాలి. అలాగే సినిమా నిర్మాణ బాధ్యతలు చార్మికి ఇవ్వాలి.

ఇన్నాళ్లు కష్టమైనా, నష్టమైనా, లాభమైనా పూరి-చార్మినే భరించారు. ఇప్పుడు టైమ్ వచ్చినపుడు తమ బ్యానర్ లేకుండా సినిమా ఎలా చేస్తారు? ఆ లాభం ఎందుకు వదులుకుంటారు? అలాగే నిర్మాణ బాధ్యతలు అంటే చార్మికి ఇష్టం. అది కాదని బండి ముందుకు నడవదు.

ఈ మేరకు రేపు (బుధవారం) ఫైనల్ డిస్కషన్లు వున్నాయి. పూరి బ్యానర్ కు ఏ బ్యానర్ యాడ్ అవుతుంది అన్నది రేపు తేలుతుంది. క్రాంతి మాధవ్ సినిమా తరువాత పూరి-విజయ్ సినిమా స్టార్ట్ అవుతుంది.

ఇలాంటి నేపథ్యంలో అర్జెంట్ గా ఓ పెద్ద కాంబినేషన్ అనౌన్స్ చేయాలనే ప్రయత్నంలో విజయ్ తెగ ప్రయత్నిస్తున్నాడని, ఇప్పటికే పూరి జగన్నాధ్ ను రెండుసార్లు కలిసాడని, మరో ఒకటి రెండు రోజుల్లో మైత్రీ-విజయ్-పూరి జగన్నాధ్ సినిమా ప్రకటన బయటకు వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమా ఫలితం వచ్చిన కొద్ది రోజులకే విజయ్ పూర్తిగా డీలా పడిపోయాడనీ, ఈ నేపథ్యంలో అర్జెంట్ గా ఏదైనా క్రేజీ ప్రాజెక్టు అనౌన్స్ చేయాలనే ప్రయత్నంలో బిజీగా వున్నాడని తెలుస్తోంది. అందులో భాగంగానే పూరి-విజయ్ ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ వీలయినంత త్వరలో వస్తుందని టాక్ వినిపిస్తోంది.

జనసేన... బతికి ఉంటేనే బేరముంటుంది!

రాహుల్ తో రచ్చ చేసిన రకుల్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?