Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి కి 8 కోట్ల రెమ్యూనిరేషన్?

పూరి కి 8 కోట్ల రెమ్యూనిరేషన్?

సినిమాలు హిట్ కాకున్నా, పూరి జగన్నాధ్ రెమ్యూనిరేషన్ ఎంత మాత్రం డవున్ కాలేదు. ఇజం సినిమాకు 8 కోట్లు డైరక్టర్ రెమ్యూనిరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ తో పూరి ఈ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ముందు పూరికి హిట్ అనేది వుంటే అది టెంపర్ సినిమా మాత్రమే. 

అది కూడా జస్ట్ హిట్ అనిపించుకుందంతే. అది మినహా మిగిలిన సినిమాలన్నీ డిజాస్టర్లే.  అయినా కూడా పూరి పారితోషికం ఏ మాత్రం డవున్ కాలేదట. కేవలం పూరినే 8 కోట్లు తీసుకుంటే మరి ఇజమ్ బడ్జెట్ ఎంతో? ఎంత కళ్యాణ్ రామ్ స్వంత సినిమా అయినా, స్టార్ కాస్ట్, ప్రొడక్షన్ అన్నీ కలిసి ఇరవై దాటేసే వ్యవహారమే మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?