దర్శకుడు పూరిజగన్నాధ్ చుట్టూ తిరుగుతున్నడ్రగ్స్ కేసులో కొత్త వదంతులు వినిపించడం ప్రారంభించాయి. పూరిజగన్నాధ్ భార్య కొంతమంది సన్నిహితుల దగ్గర వాపోయారంటూ, కొన్ని వార్తలు చక్కర్లు కొట్టడం ప్రారంభించాయి. హీరోయిన్ చార్మి అనే రాక్షసి మత్తులో పడి తన భర్త ఇలా అయిపోయారని పూరి భార్య లావణ్య తన సన్నిహితులు కొందరి దగ్గర ఆవేదన వ్యక్తం చేసారన్నది ఆ వార్తల సారాంశం.
ఛార్మితో కలిసిన తరువాతే డబ్బు ఇబ్బందులు తలెత్తాయని, అపజయాలు పలకరించాయని లావణ్య అన్నారట. అంతే కాదు, ఛార్మి సోదరుడికి పంజాబ్ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు వున్నాయని, సిట్ అధికారులు పంజాబ్ కు వెళ్లి ఆ మూలాలు వెలికి తీయాలని కోరారంటు వార్తల్లో పేర్కొన్నారు.
చార్మి మూలంగా తమ దాంపత్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయని, తను నిలదీస్తే, పూరి ఇంటికి కూడా రావడం మానేసారని, దాంతో ఇక తెగేదాకా లాగ కూడదని తాను తగ్గిపోయానని లావణ్య పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. పూరి-లావణ్య లది ప్రేమ వివాహం కావడం గమనార్హం. ఓ షూటింగ్ సమయంలో లావణ్యను చూసి పూరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
చార్మితో పూరి సంబంధాలపై ఎప్పటి నుంచో గ్యాసిప్ లు గుప్ మంటున్నాయి. ఆమె కోసమే పూరి కనెక్ట్స్ అనే సంస్థ ఏర్పాటు చేసి, ఆమెను సిఇఓ గా చేసారు. అంతే కాదు తన సినిమా ప్రొడక్షన్ పనులు కూడా చార్మికే అప్పగించారు. చార్మిని కూడా డ్రగ్స్ కేసులో సిట్ విచారించనుంది. ఒక వేళ లావణ్య అన్నారంటూ చక్కర్లు కొడుతున్న వార్తలను సిట్ సీరియస్ గా తీసుకుంటే, పంజాబ్ లో చార్మి సోదరుడి మూలాలు కూడా శోధించే అవకాశం వుంటుంది.