Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి తెలివికి దిల్ రాజు ఔట్?

పూరి తెలివికి దిల్ రాజు ఔట్?

పూరి జగన్నాధ్ తెలివే తెలివి. ఇప్పుడిలా ఎందుకు అనాల్సి వస్తోందంటే..జనగణమన అనే సూపర్ టైటిల్ ఆయన ఖాతాలోకి చేరిన వైనం తెలిసి. మహేష్ బాబుతో జనగణమన అనే సినిమా చేయబోతున్నట్లు పూరి ప్రకటించాడు. తరువాత ఆ టైటిల్ చార్మి పేరిట రిజిస్టర్ అయి వుండడం తెలిసి జనానికి కాస్త ఆశ్చర్యం వేసింది. 

కొంపదీసి మహేష్ సినిమాకు చార్మీ కానీ నిర్మాతగా వ్యవహరించబోతోందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అవేవీ కాదట..అసలు సంగతి వేరు అని తెలుస్తోంది. మహేష్ తో సినిమా అనుకుని, జనగణమన టైటిల్ అయితే బాగుంటుంది అని పూరి అనుకున్నారని వినికిడి. అయితే ఆ టైటిల్ అప్పటికే దిల్ రాజు దగ్గర వుందని తెలుస్తోంది. మహేష్ తో సినిమా, టైటిల్ కావాలంటే దిల్ రాజు అంత సులువుగా వదిలేస్తారా..తానే నిర్మిస్తా అన్నా అనొచ్చు. 

అందుకే చార్మి చేత తనకు కావాలని, చిన్న సినిమా అనే టైపులో అడిగించినట్లు తెలుస్తోంది. దాంతో దిల్ రాజు సరే, ఇచ్చేసారట. దీని వెనుక ఏ ఆర్థిక లావాదేవీ అయినా నడించిందో లేదో అన్నది మాత్రం తెలియదు. ఇక ఏముంది..మహేష్ తో ఎవరు ఆ సినిమా నిర్మిస్తే వారి పేరుకు చార్మి బదిలీ చేసే అవకాశం వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?