Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి వెనుక నిర్మాతలు?

పూరి వెనుక నిర్మాతలు?

సాధారణంగా సైలెంట్ గా తన పనేదో తాను చేసుకుపోయే దర్శకుడు పూరి జగన్నాధ్. పెద్దగా కాంట్రావర్సీల్లో తల దూర్చడు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా ముగ్గురు బయ్యర్లు కమ్ డిస్ట్రిబ్యూటర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించారు. చిత్రమేమిటంటే, ఈ వైనం.. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కూడా మింగుడుపడడం లేదు. పూరి ఏమిటి? ఇలా చేసారేమిటి? అనే అనుకుంటున్నారు తప్ప, వేరుగా కాదు. 

పూరి ఇలా చేయడం వెనుక, లోఫర్ వ్యవహారం కాకుండా మరేదో వుందనే బయ్యర్ల సర్కిళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరకాలంగా బయ్యర్లతో నిర్మాతలకు ఓ తలకాయనొప్పి వుంది. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా వారితో ఇబ్బందే వస్తోంది. హిట్ అయినా సంబరమే తప్ప సరైన లెక్కలు చెప్పడం లేదు.. ఓవర్ ఫ్లో లు కట్టడం లేదు. ఓవర్ ఫ్లో అన్నది ఓ భ్రాంతి తప్ప వేరు కాదన్నట్లుగా వుంది వ్యవహారం. 

మహా మహా హిట్ సినిమాలకే ఓవర్ ఫ్లోలు రాలేదన్నది వాస్తవం. ఏవేవో లెక్కలు, ఖర్చులు చెప్పడం పరిపాటి అయింది. అభిమానులు, చలామణీ రికార్డులు వేరు.. వాస్తవాలు వేరు. పేరుకే 40 కోట్లు దాటింది.. 70 కోట్లు చేసింది అన్న హడావుడి వాస్తవంలో చూస్తే బొటాబొటీ వసూళ్లు.. నష్టాలు. 

అయితే అదే సమయంలో ఏ మాత్రం లాస్ వచ్చినా 20 పర్సంట్ నిబంధన చూపి చాంబర్ కెక్కడం మామూలయింది. ఇలాంటి వైనం నిర్మాతలను లోలోపల రగిలిస్తోందని వినికిడి. అందుకే బయ్యర్లను కాస్త భయపెట్టాలనో, కాస్త కట్టడి చేయాలనో పూరిని ముందుకు తోసారన్న టాక్ వినిపిస్తోంది. 

కానీ అదే సమయంలో ఇలాంటి పనికి పూరి ఎందుకు అంగీకరించారన్నది? అర్థం కావడం లేదు. అంటే దీని వెనుక లోఫర్ విషయం కాకుండా సమ్ థింగ్ ఏదో వుందని, ఇరు వర్గాలు ఆ విషయం మాత్రం బయట పెట్టడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?