Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరికి అఖిల్ నో?

పూరికి అఖిల్ నో?

అదియును నీ పతి ప్రాణంబు దక్క అన్నట్లు వుంది యంగ్ హీరో అఖిల్ తో వ్యవహారం. తన రెండోసినిమా విషయంలో ఒక పాయింట్ దగ్గర మాత్రం ఫర్మ్ గా వున్నాడట. అదే డైరక్టర్ విషయం..ఎవరైనా ఫరవాలేదు..కానీ పూరి జగన్నాధ్ మాత్రం వద్దంటున్నాడట.

బహుశా తన అనంగు మిత్రుడు నితిన్ ప్రభావం ఏమో. గతంలో హార్ట్ ఎటాక్ తరువాత నితిన్ కు పూరి మథ్య బేధాలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి అందువల్లే అఖిల్ కూడా తన మిత్రుడికి సరిపడని దర్శకుడు తనకూ సరిపడడని అనుకుంటున్నాడేమో?

మరోపక్క కొరటాల శివను ఇప్పటికీ అఖిల్ కోసం ఒప్పించే ప్రయత్నాలు ఆగలేదు. ఓ పక్క మైత్రీ మూవీస్ సినిమా 28న పూజ అంటున్నా కూడా. ఇప్పటికి ఎన్టీఆర్ సినిమా ఇంకా పూర్తి కాలేదని. కనీసం ఇంకా రెండునెలలకు పైనే పడుతుందని, అంటే జనవరి వచ్చేస్తుందని, మూడు నెలల పాటు శివ ఖాళీగా వుండాల్సి వస్తుందని ఆయనకు చెబుతున్నారట. అంతకన్నా ఈ మూడునెలలు, మరో మూడు నెలలు టైమ్ తీసుకుంటే అఖిల్ తో సినిమా చేసేయవచ్చంటున్నారట.

ఎన్టీఆర్ జనవరిలో సినిమా విడుదల చేసుకున్నా, రెండు నెలలు గ్యాప్ తీసుకుంటే సరిపోతుందని వివరిస్తున్నారట. అదీ సంగతి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?