పుష్ప షూటింగ్ ఆపొద్దన్న బన్నీ!

కరోనా కారణంగా ఆగిన పుష్ప సినిమాను వేగంగా మళ్లీ సెట్ మీదకు తీసుకెళ్లమని హీరో బన్నీ క్లారిటీగా నిర్మాత, దర్శకులకు చెప్పినట్లు తెలుస్తోంది. Advertisement ఇప్పటికే ఆలస్యం అయినందున, మరింత ఆలస్యం కాకుండా చూడాలని…

కరోనా కారణంగా ఆగిన పుష్ప సినిమాను వేగంగా మళ్లీ సెట్ మీదకు తీసుకెళ్లమని హీరో బన్నీ క్లారిటీగా నిర్మాత, దర్శకులకు చెప్పినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆలస్యం అయినందున, మరింత ఆలస్యం కాకుండా చూడాలని బన్నీ చెప్పడంతో, దర్శకుడు సుకుమార్ ఇప్పుడు తన టీమ్ తో చాలా సీరియస్ గా డిస్కషన్లు సాగిస్తున్నారట. గత మూడు రోజులుగా సాగుతున్న డిస్కషన్లలో తరువాత షెడ్యూలు ప్లాన్ లు ఫిక్స్ చేస్తున్నారు.

వాస్తవానికి మారేడుమిల్లి, రంప చోడవరం ప్రాంతంలో ఆగిన బ్యాలన్స్ వర్క్, మరో షెడ్యూలు కూడా వున్నాయి. కానీ ప్రస్తుతానికి ఆ షెడ్యూలును, ఆ వర్క్ ను పక్కనపెట్టి, హైదరాబాద్ లో చేయాల్సిన వర్క్ ను ప్లాన్ చేస్తున్నారు.

హైదరాబాద్ లో చేయాల్సిన షూట్ ను, దానికి కావాల్సిన కాల్ షీట్లు వగైరా వ్యవహారాలు, ఏర్పాట్లు చేసే దిశగా డిస్కషన్లు సాగుతున్నాయి. 

అన్నీ అనుకున్నట్లు ప్లాన్ అయితే పుష్ప రెండో షెడ్యూలు హైదరాబాద్ లో అతి త్వరలో ప్రారంభమవుతుంది. కరోనా మరింత తగ్గిన తరువాతే ఔట్ డోర్ కు టీమ్ వెళ్తుంది.

మళ్ళీ అదే ప్రశ్న