ఆనందో బ్రహ్మ-యాత్ర సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు మహి వి రాఘవ్ మళ్లీ మరో ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నారు. ఆయన ఇప్పటికే యాత్ర 2 తీస్తారని వార్తలు వచ్చాయి. కానీ దానికి ఇంకా చాలా టైమ్ వుంది. మళ్లీ ఎన్నికల సమయంలోనే యాత్ర 2 చేసేంది. ఈలోగా ఓ భారీ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం మహీ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న సినిమా పాన్ ఇండియా సబ్జెక్ట్ అని తెలుస్తోంది. మంచి లైన్ చెప్పడంతో పివిపి ఓకె చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు స్క్రిప్ట్ పని మీద మహి వర్క్ చేస్తున్నారు. అది పూర్తయితే సినిమా సెట్ మీదకు వెళ్తుంది.
అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే? ఇంత భారీ సినిమాకు హీరో ఎవ్వరు అన్నది? మహితో చేయడానికి ఆసక్తి వుండాలి? పివిపితో చేయడానికి ఓకె అనాలి. అంతా రెడీ అనీ, మొదలెట్టే ముందు రివీల్ చేస్తామని పివిపి అంటున్నారు. ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు.
ఆ హీరో ఎవరో? ఆ సినిమా ఏమిటో? కొన్నాళ్ల తరువాత కానీ తెలియదు.
జగన్ ఐఏఎస్ మీటింగులో 'రిసీట్' అనే బదులు 'రిసీప్ట్' అన్నాడు..