Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆర్ ఆర్ ఆర్.. భారీ రేట్లు

ఆర్ ఆర్ ఆర్.. భారీ రేట్లు

రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ ల కాంబినేషన్ లోని భారీ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఓవర్ సీస్ మార్కెటింగ్ మీద కొద్దిరోజుల క్రితమే కొన్ని అప్ డేట్స్ ఇచ్చాం. ఇప్పుడు అదే ఫైనల్ అయింది. సింగిల్ పేమెంట్ ఇచ్చే కండిషన్ మీద 65 కోట్లకు ఓవర్ సీస్ హక్కులు మొత్తం దుబాయ్ కు చెందిన సంస్థకు ఇచ్చేసారు. ఇదే సంస్థ సాహో కూడా కొనుగోలు చేసింది.

వాస్తవానికి నిర్మాత దానయ్య 70 కోట్లకు కాస్త అటుగానే ఓవర్ సీస్ హక్కులకు ఆదాయం ఆశించారు. నెల నెలా కొంత మొత్తం వంతున విడుదల వరకు ఇచ్చేలా బేరాలు సాగాయి. ఆఖరికి అలా కాకుండా సింగిల్ పేమెంట్ కింద ఇచ్చేలా, 65 కోట్లకే విక్రయించేలా ఒప్పందం కుదిరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా మూడువందల కోట్ల బడ్జెట్ తో తయారవుతోంది. తెలుగు రాష్ట్రాల హక్కులు, ఇతర డొమస్టిక్ మార్కెట్ ఇంకా ఓపెన్ చేయలేదు. రామ్ చరణ్-ఎన్టీఆర్ లాంటి మల్టీస్టారర్లు, బాహుబలి తరువాత రాజమౌళి సినిమా కావడంతో, ఈ సినిమా దాదాపు అన్ని హక్కులు కలిసి నాలుగు వందల కోట్లకు పైగా బిజినెస్ చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. 2020 సమ్మర్ నాటికి ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది.

గాజువాకలో అయితే బొత్తిగా తృతీయస్థానం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?