డైరక్టర్ మారుతి లక్కీ హీరోయిన్ రాశీఖన్నా. ప్రతిరోజూ పండగే సినిమాలో టిక్ టాక్ స్టార్ గా హుషారుగా నటించి సినిమా హిట్ కావడానికి తన వంతు సాయం తను చేసింది. కానీ మళ్లీ అదే లక్కీ స్టార్ ను రిపీట్ చేద్దాం అనుకంటే కుదరడం లేదని బోగట్టా.
లాయర్ సబ్జెక్ట్ ను రవితేజతో అనుకున్నపుడే రాశీనే మళ్లీ హీరోయిన్ గా తీసుకోవడం అన్నది ఓ ఆప్షన్ గా పెట్టుకున్నారు. ప్రాజెక్టు గోపీచంద్ మీదకు మారిన తరువాత రాశీ లేదా కొత్త హీరోయిన్ అనే ఆప్షన్ వచ్చి చేరింది. ఇలా వచ్చి చేరడానికి కారణం గోపీచంద్ నో చెప్పడమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
గోపీచంద్ ఇప్పటికే రెండుసార్లు జిల్, ఆక్సిజన్ సినిమాల్లో రాశీతో నటించాడు. పైగా రెండూ డిజాస్టర్లే. వాస్తవానికి రాశీఖన్నా సక్సెస్ రేట్ అంతంత మాత్రమే. పైగా రీసెంట్ గా శ్రీనివాసకళ్యాణం, అయోగ్య, వెంకీమామ, వరల్డ్ ఫేమస్ లవర్, ఇలా చాలా ఫ్లాపులు వున్నాయి ఖాతాలో.
మరి ఆ కారణంగానో, లేక వేరే హీరోయిన్ ను ట్రయ్ చేయాలనో గోపీచంద్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. డైరక్టర్ మారుతి మాత్రం వీలయితే హీరోను ఒప్పించడం లేదా, కొత్త అమ్మాయిని తీసుకోవడం అనే రెండు ఆప్షన్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.