పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా 24న. శర్వానంద్ సినిమా 29న. అది భారీ సినిమా. ఇది చిన్న సినిమా. దాంట్లో పవర్ స్టార్, నోటెడ్ డైరక్టర్. ఇక్కడ యంగ్ స్టార్, సమస్యే ముంది? ఏమీలేదు. కానీ కాటమరాయుడు కు కేక్ వాక్ కావాలి. కనీసం రెండువారాల పాటు. ఎందుకంటే కాటమరాయుడుని భారీ రేట్లకు అమ్మేసారు. అది అంతా రికవరీ కావాలంటే, రెండువారాల పాటు పోటీ అన్నది వుండకూడదు.
అందుకే రాధ సినిమాకు మోకాలడ్డేసారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాధ సినిమా నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కు పవన్ కళ్యాణ్ కు అసలే కాస్త ఎడంవుంది. అది పూడ్చేయడానికి ఇదే అవకాశం. ఈ మేరకు పవన్ కు సన్నిహితుడు ఒకరు రాయబారం నడిపారని గ్యాసిప్ వినిపిస్తోంది.
నిజానికి కాటమరాయుడితో రాధ పోటీ అని వార్త వచ్చినపుడే బివిఎస్ఎన్ ప్రసాద్ కాస్త కలవరపడ్డారు. ఇలాంటి వార్తలు పవన్ తో తమకు అంతంత మాత్రంగా వున్న సంబంధాలను మరింత పాడు చేస్తాయని ఆయన కలవరపడ్డారు. ఇంతలో ఆయన ఇండస్ట్రీలో ఓ ప్రముఖుడి నుంచి ఈ రాయబారం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తప్పని సరై రాధను ఓ వారం వెనక్కు తోయడానికి ప్రసాద్ అంగీకరించారని టాక్ వినిపిస్తోంది.
ఏదినిజం అన్నది ఒకటి రెండు రోజుల్లో ఎలాగూ తెలుస్తుంది. కానీ ఒకటే పోటీ వుందా లేదా అని చూడరు. సినిమా బాగుందా లేదా అన్నది చూస్తారు.మన టాలీవుడ్ బిగ్గీస్ ఈ సంగతి ఎప్పుడు తెలుసుకుంటారో? ఎప్పుడూ థియేటర్లన్నీ తమ సినిమాతో నింపేసి, మరో ఆల్టర్నేటివ్ లేకుండా చేస్తే, తమ సినిమానే చూస్తారని అనుకుంటారు. అయినా కూడా జనం వాళ్లు చేసే పని చేస్తూనే వుంటారు.