మొహమాటం వుండొచ్చు కానీ, ఏదో సామెత చెప్పే రేంజ్ కు వుండకూడదు. సినిమా రంగంలో గాడ్ ఫాదర్లు లేరు. స్ట్రాటజీలు వర్కవుట్ చేసేంత వయసు, అనుభవం రెండూ లేవు. అందుకే ఒక అడుగు ముందుకు, మరో అడుగు వెనక్కు వేసుకుంటూ వెళ్తున్నాడు హీరో రాజ్ తరుణ్.
తనకు సినిమాలు ఇచ్చారనో, హిట్ లు ఇచ్చారనో, అడిగితే నో అంటే బాగుండదనో గెస్ట్ అప్పీరీయన్స్ లు ఇస్తున్నాడు. ఇలా ఇస్తూ పోతే ఆఖరికి, ప్రతి సినిమా క్లయిమాక్స్ రాజ్ తరుణ్ చటుక్కున వస్తాడేమో అని జనం చూసే పరిస్థితి వచ్చేస్తుంది. ఆ మధ్య ఓ సినిమాలో ఇలాగే నాని కోసం, డైరక్టర్ కోసం కనిపించాడు.
మళ్లీ ఇప్పుడు నిర్మాత కోసం కనిపించాడు. రేపు మరో సినిమాలో ఇంకెవరి కోసం కనిపిస్తాడో? హీరో అన్నాక, కాస్త హీరోలా వుండాలి. మరీ ప్రతి చోటా తళుక్కున మెరిసిపోతే, మెరుపు తగ్గిపోయే ప్రమాదం వుంది.