రాజ్ తరుణ్ హీరోగా మారుతి కథతో సినిమా ప్రారంభమైంది. సంజన రెడ్డి అనే కొత్త అమ్మాయి దీనికి దర్శకురాలు. అయితే అంతకు ముందు ఒకరిద్దరు వేరే వాళ్ల పేర్లను మారుతి హీరో రాజ్ తరుణ్ కు సజెస్ట్ చేసారు. అలాంటి పేర్లలో రోజులు మారాయి డైరక్ట్ చేసిన మురళీ కృష్ణ పేరు ఒకటి.
రాజ్ తరుణ్ కు కొత్త డైరక్టర్ మీద ఓ ఒపినియన్ అంటూ ఏర్పడడం కోసం రోజులు మారాయి రష్ కాపీని చూపించారు. కాపీని చూసిన రాజ్ తరుణ్ తనకు ఆ డైరక్టర్ వద్దు అన్నాడు. అప్పట్లోనే ఈ వార్తలు గుప్పుమన్నాయి. ఎందుకు వద్దని వుంటాడు.. సినిమా బాలేదా.. బాగా రాలేదా అన్న గ్యాసిప్ లు అప్పట్లో వినిపించాయి.
అయినా రాజ్ తరుణ్ కు ఎవరూ ఒక పట్టాన నచ్చరులే అని జనం సరిపెట్టుకున్నారు. తీరా రోజులు మారాయి విడుదలయిన తరువాత తెలిసిందే రాజ్ తరుణ్ ఆ డైరక్టర్ ను ఎందుకు వద్దనుకున్నాడో?