మహేష్ బాబు కాంబినేషన్‌లో రాజమౌళి సినిమా తెర వెనుక పనులు జోరుగా సాగుతున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఈ సినిమాను తీయబోతున్నారు. ఈ సినిమా జానర్ మీద రకరకాల వార్తలు వున్నాయి.
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అనీ, ఇంటర్నేషనల్ స్పై మూవీ అని ఇలా చాలా అంటే చాలా కథనాలు వున్నాయి. రాజమౌళి ఇలాంటి అలాంటి మామూలు సినిమా అయితే తీయరు. అది పక్కా. ప్లానింగ్ వేరే లెవెల్ లో వుంటుంది. అందులో సందేహం లేదు. అన్ని భాషల నుంచి వేరే వేరే నటులను తీసుకుని, ప్యాడింగ్ కూడా ఓ లెక్కలో చూపిస్తారు.
అయితే మహేష్ బాబుతో పాటు తెలుగు హీరోలు ఎవరైనా వుంటారా? అన్నది పాయింట్. సీనియర్ హీరో నాగార్జున ను కూడా ఓ కీలకపాత్రకు తీసుకునే ఆలోచన రాజమౌళి చేస్తున్నారనే గ్యాసిప్ గట్టిగా వినిపిస్తోంది. హీరో నాగార్జునకు దర్శకుడు రాజమౌళి కి మంచి అనుబంధం వుంది.
గతంలో రాజన్న సినిమాకు రాజమౌళి కొంత వర్క్ చేసారు. ఆ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ దర్శకుడు. అలాగే ఇప్పుడు రాజమౌళి-మహేష్ బాబు సినిమాకు నిర్మాత కెఎల్ నారాయణ. ఆయనతోనూ నాగ్ కు మంచి అనుబంధం వుంది. గతంలో నాగ్ తో కెఎల్ నారాయణ సినిమాలు నిర్మించారు.
ఇవన్నీ ఇలా వుంచితే నాగ్‌కు బాలీవుడ్‌లో మంచి గుర్తింపే వుంది. గతంలో హీరోగా సినిమాలు చేసారు. లేటెస్ట్ గా బ్రహ్మాస్త్ర సిరీస్ లో కూడా నాగ్ నటించారు. అందువల్ల నేషనల్ వైడ్ గా గుర్తుపట్టే తెలుగు నటుల్లో నాగ్ ఒకరు.
రాజమౌళి సినిమా అంటే కీలక పాత్రలకు కొదవ వుండదు. అందువల్ల నాగ్ ను తీసుకునే అవకాశాలు ఎక్కువే వున్నాయి. అఫీషియల్ గా తెలిసే వరకు ఇది జస్ట్ గ్యాసిప్ మాత్రమే.