రాజమౌళి సినిమాలో ఛాన్స్ అంటే అది బంపర్ ఆఫర్ కిందే లెక్క. తన తాజా చిత్రం ‘బాహుబలి’లో ‘అత్తారింటికి దారేది’ ఫేం ప్రణీతకి రాజమౌళి బంపర్ ఆఫర్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది.
అంతా ‘అత్తారింటికి దారేది’ సినిమా ఎఫెక్టే. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రణీత, తెలుగులోనే సిద్దార్ధ సరసన ‘బావ’ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలూ ఫ్లాపయినా, ‘అత్తారింటికి దారేది’ సినిమా రూపంలో ప్రణీతకి సూపర్ సక్సెస్ దొరికింది.
అంతే, ప్రణీత పేరు తెలుగు సినీ పరిశ్రమలో మార్మోగిపోతోంది. జూ.ఎన్టీఆర్ సరసన ప్రణీత ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేయగా, తాజాగా రాజమౌళి ఆమెకు పిలిచి ఛాన్సిచ్చాడంటూ వస్తోన్న వార్తలు నిజమైతే, ప్రణీత దశ ఓ రేంజ్‌లో తిరిగినట్టే అనుకోవాలి.