రాజమౌళి రికమెండేషన్ కు ఎన్టీఆర్ తలొగ్గుతాడా?

మంచి సినిమాలు ఒకటి రెండు తీసి, మంచి డైరక్టర్ అనిపించుకున్నారు చంద్రశేఖర్ యేలేటి. కానీ కమర్షియల్ సినిమా చేయలేడని, పైగా మాట వినని మొండి వాడని గుసగుసలు వున్నాయి. రాజమౌళికి సన్నిహిత బంధువు ఆయన.…

మంచి సినిమాలు ఒకటి రెండు తీసి, మంచి డైరక్టర్ అనిపించుకున్నారు చంద్రశేఖర్ యేలేటి. కానీ కమర్షియల్ సినిమా చేయలేడని, పైగా మాట వినని మొండి వాడని గుసగుసలు వున్నాయి. రాజమౌళికి సన్నిహిత బంధువు ఆయన.

అందుకే సాయి కొర్రపాటి మనమంతా సినిమా చంద్రశేఖర్ యేలేటితో నిర్మించారని టాక్ వినిపిస్తూ వుంటుంది. నిజానికి మనమంతా చాలా మంచి సినిమా. కానీ సాయి కొర్రపాటికి 15కోట్ల నష్టమే మిగిల్చింది. మళ్లీ ఆ నష్టం పూడ్చుకోవడానికి రాజమౌళినే బాహుబలి 2 లాంటి సినిమాల ద్వారా సాయం చేయాల్సి వచ్చింది. ఇదంతా పాత కథ.

చంద్రశేఖర్ యేలేటి బలం, బలహీనతలు ఇండస్ట్రీలో పాకిపోవడంతో మరెవరు చాన్స్ ఇవ్వడానికి సాహసించడం లేదు. నాగచైతన్య చేద్దాం అనుకున్నాడు. కానీ వెనకడుగు వేసేసాడు. ప్రస్తతం ఖాళీగా వున్న యేలేటి, టాప్ హీరోగా వున్న ఎన్టీఆర్ కు ఓ లైన్ చెప్పినట్లు టాక్ బయటకు వచ్చింది. బాగుందని, ఫుల్ స్క్రిప్ట్ చేయమని ఎన్టీఆర్ చెప్పాడంటున్నారు.

దీని వెనుక కూడా తారక్ కు రాజమౌళి రికమెండేషన్ వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అది నిజమో, కాదో అన్న సంగతి అలా వుంచితే, ఇప్పుడిప్పుడే మంచి డైరక్టర్లను ఎంచుకుంటూ, మంచి లైనప్ ఏర్పాటు చేసుకున్నాడు తారక్. ఇలాంటి టైమ్ లో మొహమాటాలకు పోయి, కమర్షియల్ గా ఫేర్ చేయని సినిమాల జోలికి పోతే మళ్లీ పాము నోట్లో పడి నిచ్చెన ఎక్కే ప్రయత్నం చేయాల్సి వస్తుంది.