Advertisement


Home > Movies - Movie Gossip
రాజమౌళి స్టాంప్ వేశారు

మంచి సినిమాలు చూస్తే వెంటనే ట్విట్టర్ లో స్పందించడం దర్శక దగ్గజం రాజమౌళికి అలవాటు. అయితే ఆ మధ్య ట్విట్టర్ లో కొన్నికొన్ని సందర్భాల్లో జనాల విమర్శల కారణంగా కాస్త ఆచితూచి స్పందిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బాగా తగ్గించేసారు.

జనవరిలో విడుదలయిన భాగమతి, ఆ మధ్య వచ్చిన మరో మంచి సినిమా ఛలో గురించి కూడా స్పందించలేదు. లేటెస్ట్ గా వచ్చిన తొలిప్రేమ మాత్రం రాజమౌళిని కదిలించేసినట్లుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈసినిమా మీద రాజమౌళి ట్వీట్ చేసారు.

Not a fan of love stories, but still enjoyed moments in #Tholiprema. Well handled by Venky on debut. Varuntej is building on his strengths. Raashi is beautiful & her performance even better. Congratulations Prasad garu & Bapi. Grand production values and a well deserved success.

ప్రేమకథలకు అభిమానిని కాకపోయినా, తొలిప్రేమలోని సన్నివేశాలు బాగా ఎంజాయ్ చేసానని చెప్పడం విశేషం. వరుణ్ తేజ, రాశీఖన్నాల మీద, నిర్మాత ప్రసాద్, ఆయన కుమారుడు బాఫినీడు మీద ప్రశంసలు, అభినందనలు కురిపించారు.

మొత్తంమీద రాజమౌళి స్టాంప్ పడింది కాబట్టి, తొలిప్రేమ పోస్ట్ వీకెండ్ లో కూడా మంచి ఫలితాలు నమోదు చేసే అవకాశం వుంది.